వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీళ్లు తీయించారు.. ఎక్కడంటే..

రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: స్కూలు నిబంధనల ప్రకారం రెండు జడలు వేసుకోకుండా వచ్చినందుకు ఓ చిన్నారికి స్కూలు ప్రిన్సిపల్ 200 గుంజీళ్ల శిక్ష విధించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

మణినగర్‌లోని లలిత గ్రీన్‌లాన్స్ స్కూల్‌లో హనీ ప్రజాపతి(10) ఐదో తరగతి చదువుతోంది. తల మీద గడ్డ రావడంతో రెండు జడలు వేసుకోలేక పోనీ టెయిల్ వేసుకుని బడికి వచ్చింది.

Students punished for sporting single braid

దీనిపై క్లాస్ టీచరు అభ్యంతరం చెప్పి ఆ చిన్నారిని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకువెళ్లింది. టీచర్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. పాప చెప్పేది వినిపించుకోకుండా ప్రిన్సిపల్ ఆ చిన్నారితో 200 గుంజీళ్లు తీయించారు.

కాళ్ల వాపులతో ఏడుస్తూ ఇంటికి వచ్చిన హనీని చూసి ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. హనీ తండ్రి ప్రవీణ్ ప్రజాపతి ఓ టీస్టాల్ ఓనర్. జరిగినదంతా హనీ చెప్పడంతో ఆయన ఆగ్రహంతో స్కూలు యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A shocking case of corporal punishment has been witnessed in a school in Gujarat's Ahmedabad city where an 11-year-old girl was hospitalised after being forced to perform sit-ups by the school authorities for forty minutes, as an outcome of not sporting two braids. The incident took place in Ahmedabad's Lalita Green Lawns School on Tuesday.Her parents rushed her to the hospital as her feet were swollen due to the punishment. The girl did not follow the school's rule due to pimples on her forehead. One of the school teachers punished several girls for not sporting two braids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X