బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచికి వెళ్లిన మాజీ సైనికుడిని చితకబాదిన ఎస్ఐ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ట్రాపిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను మానవత్వంతో ఆంబులెన్స్ వెళ్లడానికి పక్కకు తీసిన మాజీ సైనికుడిపై పోలీసు అధికారి జులం ప్రదర్శించాడు. నడిరోడ్డు మీద ఆయనను పట్టుకుని చితకబాది రెచ్చిపోయారు. ఆ సమయంలో కొందరు ఎస్ఐకి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే మీరెవరురా నాకు చెప్పడానికి అంటు ఊగిపోయారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.

మంగళవారం ఉదయం బెంగళూరులోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా వాహనం సంచారం స్థంభించింది. బెంగళూరు - బళ్లారి రోడ్డులోని కావేరి చిత్రమందిరం జక్షన్ దగ్గర రోడ్డు మీద పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో సదాశివనగర ట్రాఫిక్ పోలీసులు పక్క రోడ్డు నుండి వాహనాలు వెళ్లడానికి ఎర్పాట్లు చేశారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఒకదానికి ఒకటి తాళ్లతో కట్టి వేశారు.

sub-inspector Ganganna is caught in controversy

సదాశివనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గంగన్న ఎస్ఐగా పని చేస్తున్నారు. మంగళవారం కావేరి జంక్షన్ లో రంగన్నవిధులలో ఉన్నారు. మాజీ సైనికుడు నాగప్ప ప్రస్తుతం బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటిగార్డుగా పని చేస్తున్నారు. మంగళవారం నాగప్ప సైకిల్ మీద విధులకు బయలుదేరాడు. కావేరి జంక్షన్ రోడ్డు పోడవునా వాహన సంచారం స్థంభించి పోయింది.

అదే సమయంలో విండ్సర్ మ్యానర్ హొటల్ వైపు నుండి యలహంక దగ్గరకు అత్యవసరంగా రక్తం తీసుకు వెలుతున్న ఆంబులెన్స్ అటు వైపు వచ్చి వాహన సంచారంలో చిక్కుకునింది. విషయం గుర్తించిన మాజీ సైనికుడు నాగప్ప బ్యారికేడ్లకు ఎర్పాటు చేసిన తాళ్లువిప్పదీసి ఆంబులెన్స్ వెళ్లడానికి అవకాశం కల్పించారు. అంబులెన్స్ వెళ్లిపోయిన సందర్బంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆంబులెన్స్ వెలుతున్న విషయం గుర్తంచిన ఎస్ఐ రంగన్న అవేశంగా ఊగిపోతు వచ్చారు.

నాగప్ప షర్టు కాలర్ పట్టకుని ఇష్టం వచ్చినట్ల బూతులు తిట్టారు. ఇద్దరి మద్య మాటమాట పెరిగింది. ఆ సందర్బంలో సహనం కొల్పోయిన ఎస్ఐ రంగన్న నాగప్పను పట్టకుని చితకబాదాడు. అటు వైపు వెలుతున్న వారు అత్యాధునిక మొబైల్ లలో ఆదృశ్యాలను చిత్రీకరించి మీడియాకు అందించారు.

విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐ రంగన్న తప్పు చేశాడని, తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు అంబులెన్స్ కు దారి ఇవ్వడం ప్రతి ఒక్క పోలీసు, పౌరుడి కర్తవ్యం అని అన్నారు. నగరంలో అంబులెన్స్ సవ్యంగా వెళ్లడానికి అన్ని ఎర్పాట్లు చేస్తామని చెప్పారు. మాజీ సైనికుడు నాగప్ప మీద దాడి చేసిన ఎస్ఐ రంగన్నను సస్పెండ్ చేస్తున్నామని ఎం.ఎన్. రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రంగన్న దౌర్జన్యం చేశాడని పలువురు సమాచారం ఇచ్చారని, విచారణ చేస్తున్నామని బెంగళూరు తూర్పు విభాగం డీసీపీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. అక్కడ విధులలో ఉన్నకానిస్టేబుల్ రామమూర్తి చెప్పడం వలనే తాను బ్యారికేడ్లు పక్కకు తీసి ఆంబులెన్స్ పంపించడానికి అవకాశం కల్పించానని, అదే తప్పు అయ్యిందని మాజీ సైనికుడు నాగప్ప విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary
sub-inspector Ganganna is caught in controversy for beating an ex serviceman in Benguluru of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X