వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత జెండా రంగుల్లో డోర్‌ మ్యాట్‌లు: అమేజాన్‌కు సుష్మా వార్నింగ్

అమేజాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. భారత జాతీయ జెండాను తలపించే రంగుల్లో ఉన్న డోర్‌ మ్యాట్‌లను ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెజాన్‌ (కెనడా) విక్రయిస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమేజాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. భారత జాతీయ జెండాను తలపించే రంగుల్లో ఉన్న డోర్‌ మ్యాట్‌లను ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెజాన్‌ (కెనడా) విక్రయిస్తోంది. కాగా, దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

భారతీయుల మనోభావాలను గాయపరిచేలా ఉన్న ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆ ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేసి, భారతీయులకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు.

అలా చేయని పక్షంలో అమెజాన్‌ ఉన్నతాధికారులకు వీసాలను మంజూరు చేయబోమని, ఇప్పటికే మంజూరు చేసిన వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఈ విషయాన్ని తక్షణమే అమెజాన్‌ సంస్థకు తెలియజేయాలని కెనడాలోని భారతీయ రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు.

అమెజాన్‌ విక్రయాలపై ట్విటర్‌లో తనకు ఫిర్యాదు అందగానే సుష్మా స్పందించారు. తిరిగి ఆమె పలు ట్వీట్ల ద్వారా అమెజాన్‌(కెనడా) చర్యను ఖండిస్తూ తదుపరి చర్యలకు ఆదేశించారు. గతంలో కూడా పలు పాశ్చాత్య సంస్థలు హిందూ దేవతలను తమ ఉత్పత్తులపై అభ్యంతరకరంగా చిత్రీకరించి ఆగ్రహానికి గురయ్యాయి.

ఉత్పత్తులను తొలగించిన అమేజాన్

సుస్మా స్వరాజ్ హెచ్చరికల నేపథ్యంలో అమేజాన్ తమ వెబ్ పోర్టల్ నుంచి ఆ ప్రొడక్ట్స్ ను తొలగించిందని సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. కెనడాలోని భారత హైకమిషన్ తమ సంస్థపై చర్యలు తీసుకోకముందే తప్పిదాన్ని గుర్తించి ఆ ఉత్పత్తుల వివరాలను తీసేసినట్లు చెప్పారు.

English summary
External Affairs Minister Sushma Swaraj on Wednesday said Amazon must tender an unconditional apology and withdraw all products insulting the Tricolour. She also asked Indian High Commission in Canada to take the matter with Amazon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X