వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల్ ఇష్యూ: పంజాబ్‌లో ‘ఎస్‌వైఎల్’ కెనాల్ రగడ

పంజాబ్ నుంచి హర్యానా విడిపోయినప్పటి నుంచి రావి - బియాస్ నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉన్నది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇది మరింత వేడెక్కింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్ నుంచి హర్యానా విడిపోయినప్పటి నుంచి రావి - బియాస్ నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉన్నది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇది మరింత వేడెక్కింది. అను నిత్యం రోడ్డుపై గల చిన్న హోటళ్లు, టీ డబ్బాల వద్ద ఎస్ వైఎల్ కెనాల్ గురించే రైతులు, సాధారణ ప్రజానీకం హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారంటే దీని తీవ్రత ఏమిటో అర్థమవుతూనే ఉన్నది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ కాలువ నిర్మాణం విషయంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైనే సాగుతున్నాయి. కాలువ నిర్మాణానికి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో పరిస్థితి మరింత విషమించింది. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దెబ్బ తిన్నాయి.

పంజాబ్ రైతులు కూడా తక్కువేం తినలేదు. ఎస్‌వైఎల్ కెనాల్ నుంచి హర్యానాకు నీటి విడుదలకు వ్యతిరేకంగా రైతులంతా ఆందోళన బాట పడుతున్నారు. తమ అవసరాలకే సరిపడా నీరు లేదని, అటువంటప్పుడు హర్యానాకు నీరెలా విడుదల చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సమస్యలు పరిష్కరించరని మఖాన్ సింగ్ అనే రైతు వ్యాఖ్యానించాడు.

ఎస్‌వైఎల్ కూడా ప్రచారాస్త్రమే

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పంజాబీ రైతులంతా ఎస్‌వైఎల్ కెనాల్‌కు వ్యతిరేకంగా గళం వినిపించడం షరా మామూలుగానే ఉంది.కానీ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం తమకు తాము రైతుల అనుకూల పార్టీలమన్న ముద్ర సంపాదించుకునేందుకు అన్నదాతల ఆందోళనకు మద్దతు పలుకాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎస్ వైఎల్ కెనాల్ నిర్మాణ ప్రతిపాదన ముందుకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలన్నీ కెనాల్ నిర్మాణాన్ని విజయవంతంగా నిలువరించాయి. ప్రభుత్వాలన్నీ తామే రైతు బాంధవులమన్న వాణిని వారిలోకి తీసుకెళ్లేందుకు పోటీపడ్డాయి.

పొరుగు రాష్ట్రాలతో నీటి పంపిణీ ఒప్పందాలను రద్దు చేసేందుకు పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన 2004 నాటి పంజాబ్ ఒప్పందాల రద్దు చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నసుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ - బిజెపి సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. విపక్షం కూడా రైతుల ఆందోళన, ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా గొంతు కలిపింది. పంజాబ్ ప్రభుత్వం, ప్రతిపక్షమూ చెప్పేది ఒక్కటే మాట అదీ 'ఒక్క చుక్క నీరు కూడా వదిలేది లేదు'.

కెనాల్‌పై రాజకీయాలు

ఎస్‌వైఎల్ కెనాల్ నిర్మాణానికి సేకరించిన భూమిని రైతులకే తిరిగి స్వాధీనంచేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా.. అన్నదాతలు మాత్రం అందుకు ముందుకు రాలేదు. తమకు భూమి అక్కర్లేదని, నీరు సరఫరా చేయాలని కోరుతున్నామని రైతులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి చండీగఢ్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలోని చున్ని గ్రామ పరిసర గ్రామాల పరిధిలో నెలకొంది. నీటి పంపిణీపై ప్రభుత్వాలు శుష్క వాగ్దానాలు మాత్రమే చేస్తాయి తప్ప ఆచరణకు పూనుకోవని రైతులు వ్యంగ్యోక్తులు విసురుతున్నారంటే పంజాబ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉన్నదో అర్థమవుతూనే ఉన్నది. ఫాతేగఢ్ ఎమ్మెల్యే కుల్జిత్ నాగ్రా (కాంగ్రెస్), శిరోమణి అకాలీదళ్ జిల్లా అధ్యక్షుడు రంజిత్ సింగ్ లిబ్రా, అడ్వకేట్ అమర్ దీప్ సింగ్ వంటి వారు కూడా తమ రైతుల ప్రయోజనాలే ప్రాధాన్యం అని అంటారే తప్ప పొరుగువాడి బాగోగులు తమకొద్దంటారు. పంజాబ్ రైతులను రక్షించడమే తమ ఏజెండా అని రంజిత్ సింగ్ లిబ్రా వ్యాఖ్యానించారు.

సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా కెప్టెన్ రాజీనామా

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుల్జిత్ నగ్రా స్పందిస్తూ నీటి కొరత ఉన్నదని అంగీకరిస్తూనే.. ఎస్ వైఎల్ కెనాల్ నిర్మాణం విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తారు. దీనిపై త్యాగాలకు సిద్ధ పడ్డ పార్టీ మాత్రమే ఎన్నికల్లో విజయం సాధిస్తుందంటారు. 2004 నాటి పంజాబ్ ఒప్పందాల రద్దు చట్టాన్ని గత నవంబర్ నెలలో కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుకు వ్యతిరేకంగా అమ్రుత్ సర్ స్థానంనుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్, 42 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. కెనాల్ నిర్మాణాన్ని పున: ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

SYL canal slugfest highlights poll-bound Punjab’s water woes

కాంగ్రెస్, అకాలీలది భావోద్వేగ రాజకీయం: ఆప్

కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఈ అంశాన్ని భావోద్వేగపూరితంగా రాజకీయం చేస్తున్నాయని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు భట్టి ఆరోపించారు. '1982లో పాటియాలా ఎంపిగా ఉన్న అమరీందర్ సింగ్.. ఎస్‌వైఎల్ కెనాల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఆహ్వానం పంపుతారు. అప్పుడు సీఎంగా ఉన్న ప్రకాశ్ సింగ్ బాదల్ హర్యానా నుంచి తీసుకున్న నిధులతో కాలువ నిర్మాణం కోసం రాష్ట్ర రైతుల నుంచి భూ సేకరణ పూర్తిచేస్తారు' అని భట్టి గుర్తుచేశారు. అమర్ దీప్ సింగ్ అనే లాయర్ సైతం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయని నిందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రధాన పార్టీల వద్ద సమస్యకు పరిష్కార మార్గమే లేదంటారు.

ఆప్‌ను నిందిస్తున్న అకాలీ, కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుండటంతో ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలకు దిగాయి అధికార అకాలీదళ్, విపక్ష కాంగ్రెస్ పార్టీలు. హర్యానాకు చెందిన కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ను గెలిపిస్తే.. పంజాబ్ రైతుల నోట్లో మట్టికొట్టి హర్యానాకు నీరు తరలించుకుపోతాడని ఆ పార్టీల ఆరోపణ. ప్రస్తుత న్యాయస్థానాల చట్రంలో ఇరుక్కున్న ఎస్ వైఎల్ కెనాల్ చుట్టూ ప్రధాన పార్టీల నేతలు రాజకీయం అల్లుతున్నారు. 1970వ దశకం నుంచి పెండింగ్‌లో ఉన్న ఎస్‌వైఎల్ కెనాల్ నిర్మాణం ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీలకు అస్త్రంగా మారుతూనే ఉన్నది.

ఇదీ టైమ్‌లైన్:

1966 నవంబర్‌లో పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రం ఏర్పాటు. నాటి నుండే రావి - బియాస్ నదీ జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య ఘర్షణ.
1968: రావి - బియాస్ నదీ జలాలను పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం.
1976: సట్లెజ్ - యమునా లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ నిర్మాణానికి భాగస్వామ్య రాష్ట్రాల అంగీకారం. కెనాల్ నిర్మాణం ప్రారంభానికి హర్యానా నుంచి రూ.కోటి నిధులు పొందిన పంజాబ్.
1980: హర్యానా తన పరిధిలో కెనాల్ నిర్మాణాన్ని 1980 జూన్‌లో పూర్తిచేసింది. కెనాల్ నిర్మాణానికి రూ.55.81 కోట్లు, పంపిణీ వ్యవస్థ రూపకల్పనకు రూ.250 కోట్లు ఖర్చుచేసింది హర్యానా. కానీ పంజాబ్ పనులే ప్రారంభించలేదు.
1982: ఏప్రిల్ 8న నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంజాబ్‌లో ఎస్‌వైఎల్ కెనాల్ నిర్మాణానికి శంకుస్థాపన. ఆగస్టులో కెనాల్‌కు వ్యతిరేకంగా అకాలీదళ్ ఆధ్వర్యంలో ఆందోళన ప్రారంభం.
1985: ఆందోళనకు చరమగీతం పాడేందుకు జూలై 24న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, అకాలీదళ్ చీఫ్ సంత్ హర్‌చంద్‌సింగ్ లోంగోవాల్ మధ్య ఒప్పందంపై సంతకాలు.
1990: పంజాబ్ ప్రభుత్వం 121 కిలోమీటర్ల పొడవుగల ఎస్ వైఎల్ కెనాల్‌ను 114 కిలోమీటర్ల మేరకు పూర్తిచేసింది. కెనాల్ వద్ద పనులు చేస్తున్న 35 మంది కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లను మిలిటెంట్లు చంపేయడంతో ప్రభుత్వం పనులు నిలిపివేసింది.
1996: కెనాల్ పనులు పున: ప్రారంభం కోసం పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హర్యానా.
2004: 'పంజాబ్ ఒప్పందాల రద్దు చట్టం - 2004' చట్టాన్ని అసెంబ్లీలో జూలై 12న నాటి సిఎం అమరీందర్ సింగ్ ఆమోదింపజేసుకున్నారు. 1981 నాటి చట్టం అందరికీ ఒక్కటేనని వ్యాఖ్యా.
2016: రైతుల నుంచి స్వాధీనంచేసుకున్న 5,376 ఎకరాల భూమిని తిరిగి వారికి స్వాధీనంచేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. మార్చిలో కెనాల్ పూడ్చివేతకు పూనుకున్న రైతులు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కాలువ నిర్మాణం యధాతథంగా కొనసాగించాలని, ఎస్ వైఎల్ కెనాల్ కోసం స్వాధీనంచేసుకున్న భూమిని రైతులకు అప్పగించకూడదని మధ్యంతర ఆదేశం.
2016 నవంబర్ 10న పంజాబ్ ఒప్పందాల రద్దు చట్టం చెల్లదని సుప్రీంకోర్టు రూలింగ్.

English summary
The ‘pakodas’ on the table at Bhure Da Dhaba are piping hot, but the discussion taking place in a corner of the roadside eatery on the controversial Sutlej Yamuna Link (SYL) canal is far more heated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X