వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ మహల్ ఆలయంగా చెప్పే ఆధారాల్లేవ్: కేంద్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ సోమవారం నాడు లోకసభలో తాజ్ మహల్ విషయమై స్పందించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని తాజ్ మహల్‌ వద్ద హిందూ దేవాలయం ఉన్నది అనేందుకు ఆధారాలు లేవని చెప్పారు.

హిందూ ఆలయంగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ సమాధానమిచ్చారు.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ స్థానంలో పదిహేడవ శతాబ్దానికి ముందు శివాలయం ఉండేదని ఆగ్రాకు చెందిన న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Taj Mahal is not a Hindu Temple, says government

శివాలయం ఉన్న స్థలంలో నిర్మించిన తాజ్ మహల్‌‍ను హిందూ దేవాలయంగానే పరిగణించాలని, అక్కడ ప్రార్థనలు చేయకుండా ముస్లింలను నిరోధించాలని కూడా ఆగ్రా లాయర్లు తమ పిటిషన్‌లో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

అయితే పురావస్తు శాఖ కూడా అక్కడ శివాలయం ఉందన్న వాదనను కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో సోమవారంఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సందర్భంగా తాజ్ మహల్‌ను హిందూ ఆలయంగా ప్రకటించలేమని కేంద్రమంత్రి చెప్పారు.

English summary
Culture minister Mahesh Sharma on Monday told Lok Sabha, the government has not found any evidence that the Taj Mahal in Agra was a Hindu temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X