వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీస్ బెదిరింపు లేఖ: 'నిన్న పారిస్ చార్లీ హెబ్డో- రేపు దినమలర్'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఫ్రెంచ్ వ్యంగ పత్రిక చార్లీ హెబ్డోపై ఇస్లామిక్ మిలిటెంట్లు చేసి దాడి గుర్తుంది కదా. తమిళనాడుకు చెందిన తమిళ న్యూస్ పేపర్ 'దినమలర్'పై అదే తరహా దాడులు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తమిళనాడుకు చెందిన సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

పోలీసు అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం ఇండియా మ్యాప్ బ్యాంక్ గ్రౌండ్‌గా వచ్చి పైభాగంలో 'నిన్న పారిస్ చార్లీ హెబ్డో, రేపు దినమలర్' అంటూ ఇంగ్లీషులో ప్రచురించి తమకు లెటర్ అందినట్లు తెలిపారు. పోస్టు ద్వారా వచ్చిన ఈ లెటర్‌లో 'ది బేస్ మూమెంట్', "3/10, ఉక్కడం, కోవై, తమిళనాడు, ఇండిగా." ఆధారంగా చెప్పబడి ఉంది.

Tamil daily Dinamalar gets threat letter, warned of 'Charlie Hebdo style' attack

మ్యాప్ చివరి భాగాన ఒసామా బిన్ లాడెన్ ముఖ చిత్రంతో పాటు, బై ఆల్‌ఖైదా అంటూ అరబిక్ పదాలతో సంతకం చేసి ఉందని పోలీసులు అధికారి తెలిపారు. ఈ లెటర్‌కు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. దినమలర్ పత్రికా ఆఫీసు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.

దినమలర్ వార్తాపత్రిక కార్యాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలు, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని తేల్చిశారు.

English summary
Dinamalar, a Tamil newspaper, has reportedly received threat of an attack similar to the one by Islamist State militants on French satirical magazine Charlie Hebdo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X