చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయకు శ్రద్ధాంజలి: పన్నీర్ సెల్వం తొలి కేబినెట్ భేటీ

మంత్రి వర్గ సమావేశం పూర్తి అయిన తరువాత మంత్రులు వారివారి బాధ్యతలు స్వీకరించడానికి సిద్దం అయ్యారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే చీఫ్ జయలలిత మరణం అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వం తన మొదటి కేబినెట్ భేటీ అయ్యింది. శనివారం ఉదయం 11,30 గంటలకు చెన్నైలోని సెక్రటేరియట్ కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. కేబినెట్ మీటింగ్ ప్రారంభం కాకముందు సీఎం పన్నీర్ సెల్వం మెరినా బీచ్ చేరుకుని జయలలిత సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత అక్కడి నుంచి నేరుగా సెక్రటేరియట్ కు బయలుదేరారు.

మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయిన వెంటనే రెండు నిమిషాలు మౌనం పాటించి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి వర్గ సమావేశం పూర్తి అయిన తరువాత మంత్రులు వారివారి బాధ్యతలు స్వీకరించడానికి సిద్దం అయ్యారు.

Tamil Nadu CM O Panneerselvam first cabinet meeting

డిసెంబర్ 5వ తేది అపోలో ఆసుపత్రిలో జయలలిత మరణించిన తరువాత అర్దరాత్రి పన్నీర్ సెల్వం సీఎంగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 31తో కేబినెట్ మంత్రులుగా గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ప్రమాణస్వీకారం చేయించారు.

జయలలిత మరణించారని తెలుసుకున్న శాసన సభ్యులు, సీనియర్ మంత్రులు అదే అపోలో ఆసుపత్రిలో భేటీ అయ్యారు. పలుమార్లు చర్చించి సీఎం ఎవరు ? అనే విషయంపై పూర్తిగా ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత పన్నీరు సెల్వంను ఎన్నుకుని ఆయనను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు.

English summary
O Panneerselvam paid tribute at Jayalalitha memorial at Merina beach before headed his first cabinet meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X