వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావుకు పోస్టింగ్: ఏం జరుగుతోంది !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావుకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చారు. ఇంత కాలం ఇంటికే పరిమితం అయిన రామ్మోహన్ రావును కీలక పదవిలో కుర్చోబెట్టారు. ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఆయన నియమితులైనారు.

ఆదాయానికి మించిన అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ గత డిసెంబర్ నెలలో రామ్మోహన్ రావు ఇల్లు, సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. రామ్మోహన్ రావు కుమారుడితో సహ వారి కుటుంబ సభ్యుల నివాసాల మీద దాడులు చేశారు.

తరువాత ఆయనను తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ ను నియమిస్తూ అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశారు.

<strong>జయలలిత నియోజ వర్గంలో ఈసీ రికార్డు: దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారి !</strong>జయలలిత నియోజ వర్గంలో ఈసీ రికార్డు: దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారి !

Tamil Nadu former CS Rama Mohana Rao gets posting

అప్పటి నుంచి రామ్మోహన్ రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు రామ్మోహన్ రావును ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి కే. రాజరామన్ ను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా నియమించారు.

అదే విధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ రంజన్ మొహంతిని ఆర్కియాలజీ కమిషనర్ గా, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్. దివ్యాదర్శినిని తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

<strong>సీఎం పళనిసామికి సినిమా చూపిస్తున్న టీటీవీ, దినకరన్: రాలేదని !</strong>సీఎం పళనిసామికి సినిమా చూపిస్తున్న టీటీవీ, దినకరన్: రాలేదని !

పలువురు జిల్లా కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చెయ్యాలని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలిసిందే. ఇదే సమయంలో పలువురు సీనియర్ ఐఏఎస్ ల మీద ఒక్క సారిగా బదిలి వేటు పడటంతో ఎవరి ఒత్తిడితో ఇలా జరిగింది ? అంటూ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో చర్చ మొదలైయ్యింది.

English summary
The State government on Thursday rehabilitated P. Rama Mohana Rao, IAS, formerly Chief Secretary, and posted him as Director, Entrepreneurship Development Institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X