వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసభ్య హాస్యం: సచిన్-లతామంగేష్కర్ వీడియో రగడ

By Srinivas
|
Google Oneindia TeluguNews

మంబై: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పైన అసభ్య హాస్యంతో రూపొందించిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు సంబంధించి కమెడియన్ తన్మయ్ భట్ షాకింగ్ వీడియోను రూపొందించాడు.

లతా మంగేష్కర్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌‌లను అనుకరిస్తూ హాస్య నటుడు తన్మయ్‌ భట్‌ చేసిన ఎగతాళిపూరిత సంభాషణ వీడియో పై బీజేపీ, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగేష్కర్‌, సచిన్‌ల గౌరవానికి వీడియో భంగం కలిగిస్తోందని, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

Tanmay Bhat Roasted Over 'Sachin vs Lata' Video, Police Explore Ban

వీడియో రూపొందించిన తన్మయ్‌, ఆన్‌లైన్‌ కామెడీ సంస్థ ఏఐబీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. దీంతో వీడియోను అడ్డుకోవాల్సిందిగా ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లను ముంబై పోలీసులు కోరారు.

'సచిన్‌ వర్సెస్‌ లత సివిల్‌ వార్‌' పేరుతో, వారి ముఖాలతో ఈ నెల 26న ఫేస్‌బుక్‌లో ఉంచిన వీడియోలో మంగేష్కర్, సచిన్‌లపై తన్మయ్‌ ఎగతాళిగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ, ఎంఎన్ఎస్ పార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Comedy group AIB member Tanmay Bhat's video of a mock conversation between legends Lata Mangeshkar and Sachin Tendulkar has provoked a howl of protests and faces a ban. Prodded by political parties, the Mumbai police says it is consulting legal experts and will contact Google and YouTube on blocking the video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X