బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ యువతిని వివస్త్రని చేయలేదు: కన్నడ హోంమంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: టాంజానియా యువతిని రోడ్డు పైన వివస్త్రను చేసిన ఘటన పైన కర్నాటక హోమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ గురువారం నాడు స్పందించారు. ఆ మహిళను వివస్త్రను చేసి ఊరేగించారనడం అవాస్తవమని చెప్పారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారు.

అయితే, వివస్త్రను చేసి ఊరేగించారని చెప్పడం మాత్రం అవాస్తవమని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురిని అరెస్టు చేశామన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేశామన్నారు.

Tanzanian student not stripped and paraded, case handed over to CCB says Karnataka HM

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకొని, పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసును సిసిబికి (సిటీ క్రైమ్ బ్రాంచ్) అప్పగించినట్లు చెప్పారు. అరెస్టైన వారిలో లోకేష్ భంగరి, వెంకటేష్ రామయ్య, సలీమ్ పాషా, భాను ప్రకాశ్, రెహ్మతుల్లాలు ఉన్నట్లు చెప్పారు.

కాగా, బెంగళూరులో మొత్తం పన్నెండు వేల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిని రక్షించే బాధ్యత తమదేనని ఆయన చెప్పారు. విదేశీ విద్యార్థులకు ఎప్పుడూ రక్షణ ఉంటుందన్నారు. వారికి భద్రత కల్పించడం తమ బాధ్యత అన్నారు.

English summary
The Home Minister of Karnataka, Dr G Parameshwar said that the case relating to the assault on a Tanzanian student is being viewed seriously and the case has been transferred to the City Crime Branch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X