వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

79 వేల మంది టెక్కీలకు ఉద్యోగాలిచ్చాం, ట్రంప్ విధానాలు ప్రభావం చూపలేదు: టీసీఎస్ ఛైర్మెన్

పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల వల్ల టీసీఎస్ పై ఎలాంటి ప్రభావం పడలేదని టీసీఎస్ ఛైర్మెన్ చంద్రశేఖరన్ చెప్పారు.ట్రంప్ విధానాలు, వీసా నిబంధనల వల్ల తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదన్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల వల్ల టీసీఎస్ పై ఎలాంటి ప్రభావం పడలేదని టీసీఎస్ ఛైర్మెన్ చంద్రశేఖరన్ చెప్పారు.ట్రంప్ విధానాలు, వీసా నిబంధనల వల్ల తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదన్నారు.

వివిధ మార్కెట్లలో విజయవంతంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి దేశంలోనూ ఉద్యోగ నియామకాలు కొనసాగిస్తున్నామని టాటా సన్స్ కు ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ చెప్పారు.ముంబైలో జరిగిన టీసీఎస్ సాధారణ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ మందగమనంలో ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీసీఎస్ ఛైర్మెన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.దీంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఖర్చులను తగ్గించే పనిలో పడ్డాయి.

ఆయా దేశ నిబంధనలను పాటిస్తున్నాం

ఆయా దేశ నిబంధనలను పాటిస్తున్నాం

ప్రతి దేశంలో కూడ ఆయా దేశానికి చెందిన నియమనిబంధనలను తప్పకుండా పాటిస్తున్నామని టీసీఎస్ చైర్మెన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. టీసీఎస్ తన ప్రయాణంలో ఇప్పటిదాకా ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని విజయవంతంగా నిలిచిందన్నారు.ముంబైలో జరిగిన టీసీఎస్ సాధారణ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డేటా కీలకం

డేటా కీలకం

ప్రపంచ వ్యాపార సంస్థలు డిజిటల్ దిశగా మారుతున్నాయని, ఈ మార్పు చాలా వేగంగా జరుగుతోందన్నారు చంద్రశేఖరన్. ఐటీతో పాటు అన్ని రంగాలకు భవిష్యత్తులో డేటా ఎక్స్ లెన్స్ కీలకం కానుందన్నారు. డిజిటల్ టెక్నాలజీస్ పై రెండు లక్షల మంది ఉద్యోగులకు టీసీఎస్ ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చిందన్నారు.

డిజిటల్ ఆదాయం 300 కోట్లకు పెరుగుదల

డిజిటల్ ఆదాయం 300 కోట్లకు పెరుగుదల

డిజిటల్ ఆదాయం 28 శాతం వృధ్దితో 300 కోట్ల డాలర్లకు పెరిగాయన్నారు.టెక్నాలీ భవిష్యత్తు బ్రహ్మండంగా ఉంటుందన్నారు. భారత్ కు అపారమైన అవకాశాలున్నాయని వివరించారు. ఈ వనరులను వినియోగించుకొని భారత్ ను మరింత అభివృద్ది చేసేందుకు అవకాశాలున్నాయన్నారు.

79 వేల ఉద్యోగాలిచ్చాం

79 వేల ఉద్యోగాలిచ్చాం

గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 79 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకొన్నామని కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్ గోపినాథన్ చెప్పారు. వీరిలో విదేశాల్లో ఉద్యోగాలిచ్చిన వారి సంఖ్య 11,500 వరకు ఉందన్నారు చంద్రశేఖరన్ .అవసరాన్ని రిక్రూట్ మెంట్ చేస్తామన్నారాయన.

English summary
Amid heightened concerns over protectionism in the western markets, TCS chairman N Chandrasekaran today said nothing has changed for the country's largesy software exporter on Visas and the company continues to operate succussfully across markets including its largest market the Us.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X