వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెడ్‌రూంలో కెమెరా: పుట్టింటికెళ్లి 'గే' టెక్కీ భర్త గుట్టురట్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తాను ఊరెళ్లినప్పుడు భర్త చేసే బాగోతాన్ని భార్య బయట పెట్టింది. ఓ ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజనీరుగా పని చేస్తున్న ఓ భర్త చాలా రోజులుగా ఇంట్లో తేడాగా వ్యవహరిస్తున్నాడు.

తనతో కూడా సఖ్యంగా ఉండటం లేదు. దీంతో సదరు టెక్కీ భార్యకు ఆయన పైన అనుమానం వచ్చింది. ఆయన విషయాన్ని రట్టు చేసేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఓ రోజు తాను పుట్టింటికి వెళ్తున్నానని, త్వరలో వస్తున్నానని భర్తకు చెప్పి వెళ్లిపోయింది.

అయితే, ఆమె ఇంటి నుండి వెళ్లే సమయంలో పడకగ కదిలో భర్తకు తెలియకుండానే ఓ ఆధునాతన సీసీ కెమెరాను అమర్చింది. అయితే, భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత అతను తన భాగస్వామిని ఇంటికి తీసుకు వచ్చుకున్నాడు. అతడితో కలిసి ఉన్న వ్యవహారం కెమెరాలో నిక్షిప్తమైంది.

techie arrested under Section 377 after wife discovers he is gay

భార్య ఇంటికి తిరిగి వచ్చింది. కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను చూసి షాక్‌కు గురయింది. దీంతో అతనితో సంసారం చేయడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చింది. అనంతరం సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు దాఖలు చేయించింది.

దీని పైన భార్య మాట్లాడుతూ.. సంసార సుఖాన్ని మరిచిపోయిన ఆయన నిరాసక్తిగా ఉండేవారని, ఆడవాళ్ల లోదుస్తుల తరహాలో వాడటం, పెదాలకు పల్చగా లిప్ స్టిక్ వేసుకోవడం చేసేవారని తెలిపింది. ఆయన తీరును చూసి తాను అనుమానించానని తెలిపారు.

తాను ఇంట్లో లేనప్పుడు కొందరు మగవారిని ఇంటికి తీసుకు వచ్చేవారని చుట్టు పక్కల వారు చెబుతుండే వారని, తాను దానిని మొదట పట్టించుకోలేదని తెలిపారు. తీరా ఇటీవల తాను కెమెరాను ఉంచి చూస్తే షాకింగ్ విషయం బయటకు వచ్చిందని ఆమె వాపోయారు. అతను గే అని తెలియడంతో భార్యతో పాటు అందరు ఆశ్చర్యపోయారు.

English summary
A 32 year old engineer working with a top software firm in Bangalore was arrested recently after his wife discovered that he is homosexual. The techie has been booked under the controversial Section 377 of the Indian Penal Code that criminalises homosexuality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X