వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ మెహ్దీ 'ఘనకార్యం': 1 లక్ష 25 వేల మందికి ట్వీట్స్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: యువకులను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరాలని అనుమానిత ఉగ్రవాది మెహ్ది రెచ్చగొట్టాడని బెంగళూరు పోలీసు అధికారులు ఆదారాలు సేకరించారు. ఐసిస్ కు మద్దతుగా అత్యాదునిక టెక్నాలజిని ఉపయోగించి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్న రక్తపాతాన్ని ట్విట్టర్ ద్వార ట్విట్ చేస్తూ వచ్చాడని మెహ్ది మస్రూర్ బిస్వాస్ అలియాస్ మెహ్ది అనే అనుమానిత ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

మెహ్ది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన ట్విట్టర్ ప్రధాన నిర్వహకులలో ఒకడు అని పోలీసులు గుర్తించారు. మెహ్దిని రెండు నెలల క్రితం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి అతనిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్న పోలీసులు పలు ఆసక్తికరమైన సమాచారం సేకరించారు. ఐసిస్ లో చేరాలంటు మెహ్ది యువతకు ట్విట్ చేసేవాడు. ఈ విదంగా ఇతను 1 లక్ష 25 వేల మందికి ట్విట్ చేశాడు. అందులో 24 వేల మందితో మెహ్ది నిత్యం ట్విట్ చేస్తూ వచ్చాడు. మెహ్దికి 18 వేల మంది మద్దతుదారులు ఉన్నారని పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ 18 వేల మందిలో ఇద్దరు ప్రతినిత్యం మెహ్ది (భారత్ నుండి) ఎప్పటికప్పుడు సంప్రదించేవారు.

Techie Mehdi case: two statements recorded

మెహ్ది అరెస్టు అయ్యాడని మీడియాలో వార్తలు రావడంతో వీరిద్దరు వారి ట్విట్టర్ అకౌంట్లు మూసివేశారు. అయితే బెంగళూరు పోలీసులు సైబర్ క్రైం పోలీసుల సహకారంతో వారిద్దరు ఎవరు..... ఎక్కడ ఉన్నారు అని గుర్తరించారు. వారిద్దరిలో బెంగళూరులోని ఒక హిందు యువకుడు, చెన్నయ్ లోని ఒక ముస్లీం యువకుడు అని పసిగట్టారు. గుట్టు చప్పుడు కాకుండ, అనుమానం రాకుండ వారిద్దరి మీద పోలీసులు నిఘా వేశారు. మూడు రోజుల క్రితం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

తనను ఐసిస్ లో చేరాలని మెహ్ది రెచ్చగొట్టాడని, రక్తపాతం గురించి తెలుసుకోవాలని ఆస్తకితో సరే అన్నానని బెంగళూరుకు చెందిన యువకుడు పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే తనకు ఐసిస్ లో చేరే ఉద్దేశం లేదని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. చెన్నయ్ కు చెందిన యువకుడు తనను మెహ్ది రెచ్చగొట్టాడని పోలీసుల ముందు అంగీకరించాడు.

బెంగళూరు సీసీబీ పోలీసులు ఇద్దరిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి అనుమతితో వాగ్మూలం నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వీరిద్దరిని మెహ్ది కేసులో సాక్షులుగా పెట్టుకున్నామని, కోర్టు విచారణకు హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లరాదని హెచ్చరించి పంపించామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Two persons statements recorded in Mehdi Masroor Biswas, ISIS suspect case in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X