విభజనలో లా&ఆర్డర్ కీలకం: ఎవరీ విజయకుమార్?

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+ Comments Mail

Vijaya kumar
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన కారణంగా తలెత్తే శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్‌కు ఐపియస్ అధికారి విజయకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. టాస్క్‌ఫోర్స్‌ నేతృత్వాన్ని అప్పగించడంతోనే విజయకుమార్ ఎవరనే ఆసక్తి నెలకొంది.

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టిన ఎస్టీఎఫ్‌కు నేతృత్వం వహించింది విజయకుమారే. వీరప్పన్ రెండు రాష్ట్రాలకు నిద్రపట్టకుండా చేస్తున్న క్రమంలో ఎస్టీఎఫ్‌కు నేతృత్వం వహించి విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించారు. తమిళనాడు చెందిన విజయకుమార్ ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా సలహాదారుగా ఉన్నారు.

పోలీసు యూనిఫాం అంటే ఆయనకు బాల్యం నుంచే తెగని మక్కువ. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసినప్పుడు ఐఎఎస్ అయ్యేలా మంచి ర్యాంక్ వచ్చినా దాన్ని కాదని ఐపియస్‌లోకి వచ్చారు. ఇండియన్ పోలీసు సర్వీస్ అంటే ఆయనకు అంతగా ఇష్టం.

1952 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించిన విజయకుమార్ తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి కౌసల్య. ఆరుగురు సంతానంలో విజయకుమార్ రెండోవారు .తండ్రి నాయర్ కూడా పోలీసు అధికారి. 1975లో ఆయన యూపిఎస్సీ రాసి ఐపియస్ అయ్యారు. ఆయన పట్టుకొట్టాయ్, తిరుచ్చి, సెంబియాంల్లో ఎఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ధర్మపురి, సేలం జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు.

హైదరాబాదులోని సర్దార్ వల్లభబాయ్ పటేలే జాతీయ పోలీసు అకాడమీగా పనిచేసిన విజయకుమార్‌కు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై మంచి అవగాహన ఉందని చెబుతారు. ఈ ఉద్దేశంతోనే కాకుండా నిజాయితీగా వ్యవహరించే లక్షణం వల్ల కూడా టాస్క్‌ఫోర్స్ నేతృత్వాన్ని ఆయనకు అప్పగించినట్లు చెబుతున్నారు.

English summary
Belongs to Tamil Nadu, IPS Vijayakumar has been appointed as the head of the taskforce to study law and order situation in Andhra Pradesh by the union home ministry.
Please Wait while comments are loading...
Your Fashion Voice
Advertisement
Content will resume after advertisement