వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ కర్మకాండ: నేడు ప్రభుత్వానికి నివేదిక ! ఏం ఇస్తారు ?

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ సోమవారం కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ సోమవారం కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని తెలిసింది.

జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి రూ. 2 కోట్లు లంచం తీసుకుని ఆమెకు వీవీఐపీ సౌకర్యాలు కల్పించారని అప్పటి జైళ్ల శాఖ డీఐజీ రూప ఆరోపణలు చేశారు.

 The committe will be headed by retired IAS officer Vinay Kumar

తనపై అధికారి (డీజీపీ) సత్యనారాయణరావ్ మీద ఫిర్యాదు చేస్తూ ఏకంగా కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే డీఐజీ రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలి చేశారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాలపై విచారణ జరిపించడానికి ప్రత్యేకంగా ఓ కమిటి (సిట్)ను ఏర్పాటు చేస్తూ సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు.

సెంట్రల్ జైల్లో శశికళ తెల్లచీర కట్టుకుని: రూప దెబ్బకు దిమ్మతిరిగింది, వీవీఐపీ సౌకర్యాలు ?సెంట్రల్ జైల్లో శశికళ తెల్లచీర కట్టుకుని: రూప దెబ్బకు దిమ్మతిరిగింది, వీవీఐపీ సౌకర్యాలు ?

అప్పటి నుంచి సిట్ చీఫ్, మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారణ జరుపుతోంది. వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం విచారణ జరిపి ఒక్క వారంలో నివేదిక సమర్పించాలని సిద్దరామయ్య సూచించారు.

సోమవారం నాటితో ఒక్క వారం గడుపు పూర్తి కావడంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని, తుది నివేదిక నెలలోపు ప్రభుత్వానికి ఇస్తారని కన్నడ మీడియాలో జోరుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా ? డీఐజీ రూపకు అనుకూలంగా ఉంటుందా ? అనే విషయం త్వరలోనే వెలుగు చూడనుంది.

English summary
The Home Department has also set up a one-man inquiry committee after Chief Minister Siddaramaiah ordered a probe into the report.The committe will be headed by retired IAS officer Vinay Kumar and file an interim report on the charges of bribery and other irregularities in the Parapanna Agrahara central jail in a week and the final report in a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X