వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆదిత్యనాథ్ 'గురుభాయ్' హిందుత్వాన్ని స్వీకరించిన ముస్లీం

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గుజరాత్ ఆధ్యాత్మిక గురువుతో అనుబంధం ఉంది. ప్రధాని మోడీ గుజరాత్ వ్యక్తి. మోడీ తర్వాత... బీజేపీ తరఫున కాబోయే ప్రధాని యోగి ఆదిత్యనాథేనని ఇప్పటికే.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గుజరాత్ ఆధ్యాత్మిక గురువుతో అనుబంధం ఉంది. ప్రధాని మోడీ గుజరాత్ వ్యక్తి. మోడీ తర్వాత... బీజేపీ తరఫున కాబోయే ప్రధాని యోగి ఆదిత్యనాథేనని ఇప్పటికే చాలామంది భావిస్తున్నారు.

'రామ జన్మభూమిలో రామాలయం': కీలక నేతగా యోగి ఆదిత్యనాథ్'రామ జన్మభూమిలో రామాలయం': కీలక నేతగా యోగి ఆదిత్యనాథ్

మఠాధిపతి గులబ్‌నాథ్‌ బాపు పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదని చెప్పవచ్చు. కానీ ముస్లిం కుటుంబంలో పుట్టి, హిందూ సంప్రదాయాలను ఆచరిస్తున్న ఈయన... యోగి ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితులు.

The Muslim who became Adityanath's gurubhai

గుజరాత్‌ విస్‌నగర్‌లోని నట సంప్రదాయ ఆశ్రమ మఠాధిపతి అయిన బాపు... యోగికి గురుభాయ్ (సహావిద్యార్థి) కూడా. వీరిద్దరూ ఒకే గురువు వద్ద శిష్యరికం చేశారు.
గోరఖ్‌పూర్‌ ఆశ్రమ మఠాధిపతి అవైద్యనాథ్‌ వద్ద యోగి ఆదిత్యనాథ్‌ శిష్యరికం చేశారు.

గులబ్‌నాథ్‌ స్వయంగా మఠాధిపతి అయినప్పటికీ.. అవైద్యనాథ్‌తో అవినాభావ సంబంధం కారణంగా ఆయన వద్ద శిష్యుడిగా చేరారు. దీంతో యోగికి గులబ్‌నాథ్‌ గురుభాయ్‌ అయ్యారు.

గోరఖ్‌పూర్‌లో ఉన్న సమయంలో వీరి మధ్య అవినాభావ సంబంధం ఉండేది. గతేడాది డిసెంబర్‌లో గులబ్‌నాథ్‌ మరణించిన సమయంలో ఆదిత్యనాథ్‌ గుజరాత్‌కు వెళ్లి ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతటి సాన్నిహిత్యం ఉంది వారి మధ్య.

మఠాధిపతిగా వ్యవహరించిన గులబ్‌నాథ్‌ ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు గుల్‌ మహ్మద్‌ పఠాన్‌. పద్దెనిమిదేళ్ల ఏళ్ల వయసులో మఠాధిపతి బాలక్‌నాథ్‌ విధానాలకు ఆకర్షితులైన గుల్‌.. హిందూ మతాన్ని స్వీకరించి దీక్ష చేపట్టారు. అలా హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆశ్రమంలో ఉన్నారు. ఆదిత్యనాథ్ విస్ నగర్‌లోని మఠ్‌లో రెండుమూడుసార్లు పర్యటించారు.

English summary
Aditya Nath Yogi, recently appointed chief minister of Uttar Pradesh, has a close Gujarat connection apart from his ties with PM Narendra Modi. The erstwhile mahant of a math (ashram) of Nath sampradaya in Visnagar, Mahant Gulabnath Bapu, who was born as a Muslim with the name Gul Mohammad Pathan, was the 'gurubhai' of today's UP CM, considered a Hindu hardliner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X