వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవాలో అందరికీ సమానంగా మంత్రి పదవులు: కాంగ్రెస్ కు చెక్ !

గోవాలో కాంగ్రెస్ ను దెబ్బ తియ్యడానికి గోవా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (జీఎఫ్ పీ), మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో మాట్లాడి అందరికీ సమానంగా మంత్రి పదవులు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

పణజి: గోవాలో అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ వేసిన స్కెచ్ కు కాంగ్రెస్ చిత్తు అయ్యింది. 17 మందిఎమ్మెలు ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా 13 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ గోవాలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కు మారోసారి షాక్ ఇస్తున్నది.

బీజేపీకి మద్దతు ఇస్తున్నా పార్టీలకు మంత్రిపదువుల పంపిణి విషయంలో సర్దుబాట్లు జరిగిపోయాయి. గోవా ఫార్వర్ బ్లాక్ పార్టీ (జీఎఫ్ పీ)కి రెండు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి రెండు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు రెండు, బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని మనోహర్ పారీకర్ నిర్ణయం తీసుకున్నారు.

చిన్న పార్టీల డిమాండ్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం కొన్ని షరతులతో అంగీకరించింది. అయితే చిన్న పార్టీలు మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులనే సంప్రదించారు. వారి డిమాండ్లు అంగీకరించడానికి కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వెయ్యడంతో వెంటనే మనోహర్ పారీకర్ రంగంలోకి దిగారు..

గోవా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (జీఎఫ్ పీ), మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో మాట్లాడి అందరికీ సమానంగా మంత్రి పదవులు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. 13 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ సైతం కేవలం రెండు మంత్రి పదవులతో సరిపెట్టుకుంది.

మంగళవారం సాయంత్రం 5 గంటలకు గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారీకర్ ప్రమాణస్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనోహర్ పారీకర్ తో సహ 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మనోహర్ పారీకర్ గోవా అసెంబ్లీలో ఈనెల 16వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకోవాలి.

English summary
The Supreme Court also refused to stay the oath taking ceremony of Manohar Parrikar as the Chief Minister of Goa. He is scheduled to take oath at 5 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X