వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో డీఎంకే రచ్చరచ్చ, పేపర్లు విసిరేసి, కర్చీలు లాగేసి, పన్నీర్ కే !

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చెయ్యడంతో అసెంబ్లీ సమావేశం రచ్చరచ్చ అయ్యింది. డీఎంకే ఎమ్మెల్యే కేకే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో తీవ్రగందరగోళం ఏర్పడంతో రచ్చరచ్చ అయ్యింది. రహస్య ఓటింగ్ కుఅనుమతి ఇవ్వాలని పట్టుబట్టిన పన్నీర్ సెల్వంకు డీఎంకే మద్దతు ఇవ్వడంతో శాసనసభా సమావేశం వేడెక్కింది. సభ రచ్చ రచ్చ కావడంతో మద్యాహ్నం 1 గంటకు వాయిదా వేశారు.

డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు రహస్య ఓటింగ్ కు పట్టుబట్టి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . కుర్చీలు లాగేసి పేపర్లు గాలిల్లోకి విసిరేశారు. స్పీకర్ ధనపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవడం లేదని ఎంకే. స్టాలిన్ విరుచుకుపడ్డారు.

The Tamil Nadu legislative assembly has been adjourned to 1 pm after the Speaker

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ మాత్రం రహస్య ఓటింగ్ కు తాను ఎట్టి పరిస్థితిలో అనుమతి ఇవ్వనని తేల్చి చెప్పడంతో సభ రచ్చరచ్చ అయ్యింది. అసెంబ్లీలో పన్నీర్ సెల్వం మాట్లాడటానికి స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.

ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ మాట్లాడానికి స్పీకర్ ధనపాల్ అనుమతి ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా రహస్య ఓటింగ్ జరగాలని పన్నీర్ సెల్వం పట్టుబట్టడంతో డీఎంకే పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఎలాగైనా శశికళ వర్గం ఏర్పాటు చేసిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని డీఎంకే నాయకులు అసెంబ్లీలో చాలెంజ్ చేశారు.

డీఎంకే ఎమ్మెల్యే కేకే. సెల్వం స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లి ధర్నా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే సెల్వంకు పలువురు డీఎంకే ఎమ్మెల్యేలతో సహ పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తూ స్పీకర్ పోడియం దగ్గర ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

English summary
The Tamil Nadu legislative assembly has been adjourned to 1 pm after the Speaker, Dhanpal who was heckled by the DMK MLAs walked out. The Speaker who was gheraoed had to be rescued by the marshals in the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X