వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్‌పై భారత ముస్లీం మహిళ విజయం: ఈ 5గురు మహిళల పోరాటం

ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదంటూ సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం మహిళ సైరా బానో హర్షం వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతి

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదంటూ సుప్రీం కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం మహిళ సైరా బానో హర్షం వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

ముస్లీం దేశాల్లోనే లేదు, సంప్రదాయం: ట్రిపుల్ తలాక్‌పై జడ్జిల్లోనే విభేదాలుముస్లీం దేశాల్లోనే లేదు, సంప్రదాయం: ట్రిపుల్ తలాక్‌పై జడ్జిల్లోనే విభేదాలు

ఇది దేశంలోని ముస్లిం మహిళలు ఎంతో ఆనందించే రోజని ఆమె అన్నారు. దేశానికే ఈ రోజు చారిత్రక దినం అని, అనేక మంది రద్దు కావాలని కోరుకున్నారని, వద్దని చెప్పిన వారూ ఉన్నారన్నారు. ముస్లిం సమాజంలో చట్టం తేవడానికి వారు ఇష్టపడరన్నారు. ఈ అంశాలన్నింటినీ అర్ధం చేసుకుని సుప్రీం ఈ చారిత్రక తీర్పు ఇచ్చిందని సైరా బానో తెలిపారు.

పాక్ సహా ఈ దేశాల్లో లేదు: ట్రిపుల్ తలాక్‌ అమల్లోలేని దేశాలివే!పాక్ సహా ఈ దేశాల్లో లేదు: ట్రిపుల్ తలాక్‌ అమల్లోలేని దేశాలివే!

అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ముస్లిం మహిళల స్థితగతులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును ఎవరూ దయచేసి రాజకీయం చేయవద్దని, రాజకీయ ఎజెండాగా తీసుకోవద్దని ఆమె కోరారు. ముస్లిం మహిళల పరిస్థితిని అర్థం చేసుకుని, మార్పును స్వాగతించి వీలైనంత త్వరగా చట్టాన్ని చేయాలని కోరారు.

చరిత్ర సృష్టించిన సైరా బానో

చరిత్ర సృష్టించిన సైరా బానో

ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం తీర్పు వెనుక సైరా బానో రెండేళ్ల పోరాటం దాగి ఉంది. ఇందులో ఆమె విజయం సాధించారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఆమె 2016 ఫిబ్రవరిలో వేసిన కేసుకు అఫ్రీన్ రెహమాన్, మరో ముస్లీం మహిళ సంఘం తోడుగా నిలిచింది. నోటితో తలాక్.. తలాక్.. తలాక్ అని మూడుసార్లు చెప్పడం ద్వారా ముస్లీం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇవ్వడంపై వీరు న్యాయ పోరాటం చేశారు. భార్యలకు కనీసం భరణం కూడా ఇవ్వడం లేదు.

ఎవరీ సైరా బానో?

ఎవరీ సైరా బానో?

ఉత్తరాఖండ్‌కు చెందిన 35 ఏళ్ల సైరా బానోకు పద్నాలుగేళ్ల వైవాహిక జీవితానికి భర్త స్వస్తి చెప్పి, 2015లో తలాక్ ద్వారా విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైరా బానో సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఆమె కథనం ప్రకారం.. 2001లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులకే కట్నం తేవాలని అత్తింటి వారు ఆమెను వేధించారు. ఇద్దరు పిల్లల తర్వాత.. అదనపు సంతానాన్ని పోషించలేనని చెప్పి ఆరేడుసార్లు సైరా బానోకు అబార్షన్ చేయించాడు. చివరకు పద్నాలుగేళ్ల తర్వాత 2015లో పుట్టింటికి పంపించారు. ఆ తర్వాత పిల్లల్ని పంపించారు. ఓ రోజు స్పీడ్ పోస్టులో తలాక్ అంటూ పంపించారు. ముస్లీం మత పెద్దల వద్దకు వెళ్లగా అది చెల్లుతుందని చెప్పారు. దీంతో ఆమె న్యాయవాదిని మాట్లాడుకొని న్యాయ పోరాటం చేశారు.

ఎవరీ అప్రీన్ రెహమాన్?

ఎవరీ అప్రీన్ రెహమాన్?

సైరా బానోను పలువురు మహిళలు ఆదర్శంగా తీసుకున్నారు. జైపూర్‌కు చెందిన ఎంబియే గ్రాడ్యుయేట్ అఫ్రీన్ రహమాన్ 2014లో ఇండోర్‌కు చెందిన న్యాయవాదిని పెళ్లి చేసుకున్నారు. ఆమె సోదరులు రూ.25 లక్షల లోన్ తీసుకొని ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కలహాలు ప్రారంభమయ్యాయి. ఏడాది తర్వాత అఫ్రీన్‌ను పుట్టింటికి పంపించారు. స్పీడ్ పోస్టులో భర్త తలాక్ పంపించారు. దీంతో సైరా బానో బాటలో అఫ్రీన్ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఎవరీ గుల్షన్ పర్వీన్

ఎవరీ గుల్షన్ పర్వీన్

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గుల్షన్ పర్వీన్ అనే 31 ఏళ్ల మహిళకు 2013లో పెళ్లయింది. బిడ్డ ఉన్నాడు. భర్త ఆమెను అదనపు కట్నం కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లింది. 2015లో భర్త తలాక్ అంటూ విడాకులు ఇచ్చాడు. ఆయన రూ.10 స్టాంప్ పేపర్ పైన రాసి పంపాడు.

ఎవరీ ఇష్రాత్ జహాన్

ఎవరీ ఇష్రాత్ జహాన్

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇష్రత్ జహాన్‌కు 31 ఏళ్లు. ఆమెకు పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. నలుగురు పిల్లలు. దుబాయ్‌లో ఉండే భర్త 2015లో ఏప్రిల్లో తలాక్ అని చెప్పి విడాకులు తీసుకున్నాడు.

అతియా సబ్రీ

అతియా సబ్రీ

యూపీకి చెందిన అతియా సబ్రీ అనే 30 ఏళ్ల మహిళకు 2012లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త అదనపు కట్నం కింద రూ.25 లక్షలు తేవాలని డిమాండ్ చేసారు. ఈమె 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భర్త పేపర్ పైన మూడుసార్లు తలాక్ అని రాసి విడాకులు తీసుకున్నాడు. వీరంతా కూడా న్యాయ పోరాటం చేశారు.

జకియా, నూర్జాహాన్

జకియా, నూర్జాహాన్

జకియా సోమన్, నూర్జాహాన్ నియాజ్‌లు 2007లో భారతీయ ముస్లీం మహిలా ఆందోళన సంస్థను ప్రారంభించారు. పదిహేను రాష్ట్రాల నుంచి 30 వేల మంది మహిళా సభ్యులు ఇందులో ఉన్నారు. మసీదుల్లోకి, ముంబైలోని హాజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలని ఆందోళనలు నిర్వహించారు. ఈ సంస్థ సైరా బానో, అఫ్రీన్ పక్షాన కోర్టులో తన వాదన వినిపించింది. దేశంలోని ముస్లీం మహిళల్లో 92 శాతం మంది ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

English summary
The Supreme Court (SC) on Tuesday held the Muslim practice of triple talaq unconstitutional and struck it down by 3:2 majority. The SC said triple talaq violates the fundamental right of Muslim women as it irrevocably ends marriage.Triple talaq , or verbal divorce, is practiced by some in the Muslim community to instantly divorce their wives by saying talaq three times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X