వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూళ్లలో విద్యార్థులకు నపుంసక టీకాలు.. వదంతులతో మూతబడిన పాఠశాలలు

వదంతుల కారణంగా అసోంలోని బార్పేట, నల్బారి, కామ్‌రూప్ జిల్లాల్లోని ముస్లింలు అధికంగా ఉండే గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు రావడం మానేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గౌహతి: వదంతుల కారణంగా అసోంలోని బార్పేట, నల్బారి, కామ్‌రూప్ జిల్లాల్లోని ముస్లింలు అధికంగా ఉండే గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు రావడం మానేశారు. కాదు..కాదు.. తల్లిదండ్రులే పిల్లలను బడికి పంపడం మానేశారు.

ముస్లిం విద్యార్థులను నపుంసకులుగా మార్చేందుకు స్కూళ్లలో టీకాలు ఇస్తున్నారన్నదే ఆ ప్రచారం. దీంతో భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడం మానేశారు.
నిజానికి ఆరోగ్య శాఖ వేక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది.

జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) సోకకుండా ఏప్రిల్ 30 నుంచి మే 20 వరకు నల్బరి, మోరిగావ్, బొంగై గావ్, కచర్ జిల్లాల్లో 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇస్తోంది. స్కూళ్లలో మాత్రం ఎటువంటి వేక్సిన్లు ఇవ్వడం లేదు.

‘They are targeting Muslim children’: A rumour about ‘impotency vaccine’ is causing panic in Assam

అయితే స్కూళ్లలో పిల్లలకు నపుంసక టీకాలు ఇస్తున్నట్టు వాట్సాప్‌లో మెసేజ్‌లు చక్కర్లు కొట్టడంతో భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడం మానేశారు.

గతంలో ఇటువంటి సందేశాలే హరియాణా, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కలకలం రేపాయి. ఇప్పుడది అసోంకు పాకింది. దేశంలోని ముస్లిం జనాభాను నియంత్రించడంలో భాగంగానే నపుంసక టీకాలు ఇస్తున్నట్టు ఆ వీడియో మెసేజ్‌లో ఉంది. దీంతో ఏ స్కూల్‌లోనూ విద్యార్థుల హాజరు శాతం పదికి మించడం లేదు.

హిందూ యువఛాత్ర పరిషత్ పంపిణీ చేసిన కరపత్రాల వల్లే ఇదంతా జరిగినట్టు సామాజిక కార్యకర్త హఫీజ్ అహ్మద్ తెలిపారు. ముస్లింలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ అమలు చేస్తామని అందులో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కరపత్రం ఇప్పటిది కాదని.. 2014 నాటిదని, అప్పట్లో దానిని ఎవరూ పట్టించుకోలేదని పరిషత్ అసోం చాప్టర్ అధ్యక్షుడు బాలెన్ బైష్యా తెలిపారు.

English summary
On May 16, Ismail Hussain, the diminutive headmaster of Hemanta Barua Vidyapeeth Middle English School, had an unusually busy morning. It was not academic and administrative work that kept him occupied, though. In fact, there was hardly any academic activity in the school that morning: only 60 of the 365 students had turned up. Hussain was attending to a battery of journalists who had set up camp at this nondescript government school in the Muslim-dominated locality of Hatigaon in Assam’s Guwahati.Hussain’s school, along with Natboma Primary School and Hemanta Barua Vidyapeeth High School in the same neighbourhood, were the first casualties of a rumour that reached the state capital this week. On its way, it had already caused panic in the rural parts of Barpeta, Nalbari and Kamrup districts, keeping students out of school for days. Children in government-run schools, it was rumoured, were being administered a vaccine that could lead to infertility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X