వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దున్నపోతుకి రూ. 7 కోట్లు ఆఫర్, నో అన్న యజమాని

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కింద చిత్రంలో కనిపిస్తున్న దున్నపోతు యజమాని ఏడు కోట్లు ఇచ్చి కొనుగోలు చేద్దామని ఓ రైతు ముందుకొచ్చాడు. ఐతే ఈ దున్నపోతు యజమాని మాత్రం ఏడు కోట్లు కాదు కదా ఇంకెన్ని కోట్లిచ్చినా అమ్మేది లేదని చెప్పాడు. ఇంతకీ ఈ దున్నపోతు ప్రత్యేకతలు ఏంటీ అని అనుకుంటున్నారా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కరమ్‌వీర్‌సింగ్ అనే రైతు కొన్నేళ్ల క్రితం ముర్రాజాతికి చెందిన దున్నపోతును కొన్నాడు. ఈ యువరాజు రోజూ.. 20 లీటర్ల పాలు తాగుతాడు. ఐదు కిలోల యాపిల్స్ తింటాడు. 15 కిలోల గడ్డిని మేస్తాడు. దున్నపోతుకు ఆహారం కోసమే కరమ్‌వీర్‌సింగ్ ప్రతిరోజూ రూ. 25వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది.

This 1,400kg bull is a cash cow; owner turns down Rs 7 crore offer

దున్నపోతు బరువు 1,400 కేజీలు. ఎత్తు 5 ఆడుగుల 9 అంగుళాలు. ఇటీవల మీరట్‌లో జరిగిన అంతర్జాతీయ పశుప్రదర్శనలో చాంపియన్‌గా నిలిచాడు. ఆ ప్రదర్శనను తిలకించిన చండీగఢ్‌కు చెందిన ఓ రైతు, యువరాజును కొంటానని, ఇందుకు రూ. 7కోట్లు ఇస్తానని ముందుకువచ్చాడు. ఎన్ని కోట్లిచ్చినా తన దున్నపోతును అమ్మబోనని చెప్పాడు. అందుకు కారణం.. ఆ దున్న పోతు ద్వారా సింగ్, ఏటా రూ. 50 లక్షల దాకా సంపాదిస్తున్నాడు కరమ్‌వీర్‌సింగ్.

ఎలాగంటే, ఈ దున్నపోతు ప్రతిరోజు 3.5 నుంచి 5 మిల్లీ లీటర్ల వీర్యాన్ని విడుదల చేస్తుంది. ఈ వీర్యాన్ని పలుచన చేస్తే 35 మిల్లీ లీటర్లు అవుతుంది. ఆ మొత్తం వీర్యాన్ని తాను డెయిరీ పరిశ్రమకు అమ్మేస్తే 2లక్షలు వస్తుందని, వీర్యంతోనే ఏడాదికి కోట్లాది రూపాయలు తన యువరాజు సంపాదించిపెడుతున్నాడని కరమ్‌వీర్‌సింగ్ గర్వంగా చెప్పాడు. వీర్యం అమ్మకం ద్వారా రోజూ వచ్చే ఆదాయం రూ.2,10,000. ఈ వీర్యాన్ని ముర్రా జాతి పశువుల ఉత్పత్తికి ఉపయోగిస్తారు.

English summary
A big crowd of gawkers has gathered around Yuvraj, a giant 1400kg Murrah bull that on Friday was crowned champion at Meerut's All India Cattle Show by a 10-member jury, startled as much by the animal's size as by his owner's refusal to sell it for a mind-boggling Rs 7 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X