వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఆస్తులకు భారీ బందోబస్తు, మన్నార్ గుడి మాఫియా చొరబడుతుందని నిఘా!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన నివాసం పోయెస్ గార్డెన్, నీలగిరి జిల్లా కొటగిరిలోని కొడనాడు ఎస్టేట్ దగ్గర భద్రత కట్టుదిట్టం చెయ్యాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఆదేశాలు జారీ చేశారు. పోయెస్ గార్డెన్, కొడనాడు ఎస్టేట్ దగ్గర పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.

టీటీవీ దినకరన్ కు కాలిపోయింది, జైల్లో శశికళకు చెప్పాలని చలో బెంగళూరు!టీటీవీ దినకరన్ కు కాలిపోయింది, జైల్లో శశికళకు చెప్పాలని చలో బెంగళూరు!

పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను జయలలిత స్మారక భవనంగా తీర్చిదిద్దుతామని సీఎం ఎడప్పాడి పళనిసామి చెప్పారు. పోయెస్ గార్డెన్ ఇక ప్రభుత్వానిదే అని పళనిసామి తేల్చి చెప్పారు. అయితే పోయెస్ గార్డెన్ అమ్మ స్మారక భవనంగా మార్చడానికి జయలలిత మేనకోడులు దీపా, ఆమె సోదరుడు దీపక్ వ్యతిరేకిస్తున్నారు.

Tight security deployed outside Poes Garden

జయలలిత ఆస్తులు అన్ని మావే, మేమే వారసులు అని దీపా, దీపక్ అంటున్నారు. ఈ సందర్బంలో పోయెస్ గార్డెన్, కొడనాడు ఎస్టేట్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్కరిని కూడా పోయెస్ గార్డెన్ ఆవరణంలోని వేదనిలయం, కొడనాడు ఎస్టేట్ లోకి అనుమతించమని పోలీసు అధికారులు చెప్పారు.

నా కాళ్లు పట్టుకుంటే టీటీవీ దినకరన్ కు ఆ పదవి వచ్చింది: మంత్రి సంచలన వ్యాఖ్యలు!నా కాళ్లు పట్టుకుంటే టీటీవీ దినకరన్ కు ఆ పదవి వచ్చింది: మంత్రి సంచలన వ్యాఖ్యలు!

కొడనాడు ఎస్టేట్ లోకి శశికళ కుటుంబ సభ్యులు చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టడం వలనే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిసింది. కొడనాడు ఎస్టేట్ ప్రధాన ద్వారం మూసివేసి చుట్టు పక్కల బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అటు వైపు వెలుతున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

English summary
Tight security deployed outside Poes Garden and Kodanad estate in Kothagiri in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X