వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మరణంపై విచారణ జరిపిస్తాం: స్టాలిన్ రివర్స్ గేర్, మన్నార్ గుడి క్లోజ్, పన్నీర్ తో !

జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎం.కే. స్టాలిన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

రాణిపేట/చెన్నై: జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షిస్తామని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎం.కే. స్టాలిన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

ఆంటీతో నగ్నంగా బెడ్ రూంలో, అంకుల్ డోర్ తీసి వీడియో, మధ్యలో వస్తావా అంటూ!ఆంటీతో నగ్నంగా బెడ్ రూంలో, అంకుల్ డోర్ తీసి వీడియో, మధ్యలో వస్తావా అంటూ!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని ఛేదించే బాధ్యతలను ఆయన భూజాలకెత్తుకున్నారు. మేము అధికారంలో వచ్చిన వెంటనే జయలలిత మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని రాణిపేటలో జరిగిన డీఎంకే పార్టీ సమావేశంలో ప్రకటించారు.

షాక్ గురైనారు !

షాక్ గురైనారు !

గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత ఇక ప్రజా జీవితంలోకి రాకుండానే డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం మరణించారు. జయలలత రాక కోసం ఎదరు చూసిన ప్రజలు చిరవికి ఆమె మరణించారని తెలుసుకుని భిన్నులైనారు.

గవర్నర్, సీఎంకు నో చాన్స్

గవర్నర్, సీఎంకు నో చాన్స్

74 రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందారని, ఆ సమయంలో తమిళనాడు గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావు, అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ను సైతం జయలలితను చూడటానికి అవకాశం ఇవ్వకపోవడం చాల అనుమానాలకు దారి తీసిందని స్టాలిన్ ఆరోపించారు.

శశికళ మీద తిరుగుబాటుతో !

శశికళ మీద తిరుగుబాటుతో !

శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం తనతో పాటు పలువురు అమ్మ మరణంపై మర్మం ఉందని ఆరోపించారు. వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు సీబీఐతో విచారణ చేయించడానికి ముందుకురాలేదని స్టాలిన్ ఆరోపించారు.

ఎమ్మెల్యేలు కాదు రేసుగుర్రాలు !

ఎమ్మెల్యేలు కాదు రేసుగుర్రాలు !

జయలలితను చూసి ప్రజలు అన్నాడీఎంకే పార్టీకి ఓట్లు వేశారని స్టాలిన్ గుర్తు చేశారు. అయితే జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు రేసుగుర్రాల్లా ఒక్కొక్కరు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు అమ్ముడు పోయారని స్టాలిన్ ఆరోపించారు.

అమ్మపై చెరిగిపోని అభిమానం

అమ్మపై చెరిగిపోని అభిమానం

ప్రజల్లో జయలలితపై చెరిగిపోని అభిమానం గుర్తించిన స్టాలిన్ ఇప్పుడు అమ్మను పొగడడం మొదలుపెట్టారు. జయలలిత స్వయం శక్తితో పైకి వచ్చిన నాయకురాలు అంటూ పొగిడారు. జయలలిత అధికారంలోకి వస్తే ఆమె మరణం తరువాత ఇప్పుడు తమిళనాడులో బినామీ ప్రభుత్వం ఉందని స్టాలిన్ మండిపడ్డారు.

రాష్ట్రపతి ఎన్నికలు డెడ్ లైన్ !

రాష్ట్రపతి ఎన్నికలు డెడ్ లైన్ !

రాష్ట్రపతి ఎన్నికల తరువాత తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని స్టాలిన్ జోస్యం చెప్పారు. తరువాత తమిళనాడులో జరిగే శాసన సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తోందని, ప్రజలు అదే కోరుకుంటున్నారని స్టాలిన్ అన్నారు.

మన్నార్ గుడి మాఫియా కథ క్లోజ్ !

మన్నార్ గుడి మాఫియా కథ క్లోజ్ !

జయలలిత మరణం వెనుక మర్మం ఉందని ఆరోపణలు రావడంతో అందరూ శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేస్తూ వారి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. పన్నీర్ సెల్వం సైతం అదే విషయం చెబుతున్నారు. ఇప్పుడు జయలలితకు రాజకీయంగా భద్దశత్రువు అయిన డీఎంకే నాయకుడు స్టాలిన్ సైతం జయలలిత మరణంపై విచారణ జరిపిస్తామని సంచనల వ్యాఖ్యలు చెయ్యడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

English summary
TN Assembly election must be come after presidential election said DMK working president MK Stalin today in Thiruvallur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X