వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీతో మాజీ సీఎం పన్నీర్ సెల్వం భేటి, ఎమ్మెల్యే జంప్, మరుసటి రోజే ఇలా !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ (పురట్టి తలైవి అమ్మ) శిభిరం నాయకుడు పన్నీర్ సెల్వం తన వర్గంలోని ఎంపీలతో కలిసి ప్రధాన మంద్రి నరేంద్ర మోడీని కలిశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ (పురట్టి తలైవి అమ్మ) శిభిరం నాయకుడు పన్నీర్ సెల్వం తన వర్గంలోని ఎంపీలతో కలిసి ప్రధాన మంద్రి నరేంద్ర మోడీని కలిశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీని మాజీ సీఎం పన్నీర్ సెల్వం కలిశారు.

సెంట్రల్ జైల్లో శశికళ తెల్లచీర కట్టుకుని: రూప దెబ్బకు దిమ్మతిరిగింది, వీవీఐపీ సౌకర్యాలు ?సెంట్రల్ జైల్లో శశికళ తెల్లచీర కట్టుకుని: రూప దెబ్బకు దిమ్మతిరిగింది, వీవీఐపీ సౌకర్యాలు ?

పన్నీర్ సెల్వంతో పాటు ఎంపీలు మనోజ్ పాండియన్, నత్తం విశ్వనాథన్, మనుసామి, మైత్రేయన్, సెమ్మలై తదితరులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తరువాత పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు.

రాజకీయాలు కాదు, అందుకే !

రాజకీయాలు కాదు, అందుకే !

మర్యాదపూర్వకంగానే తాము ప్రధాని నరేంద్ర మోడీని కలిశామని పన్నీర్ సెల్వం అన్నారు. మోడీతో తాము రాజకీయాల గురించి మాట్లాడలేదని మీడియాకు చెప్పారు. శశికళ మీద తిరుగుబాటు చేసిన తరువాత అన్నాడీఎంకే పార్టీని పన్నీర్ సెల్వం రెండుగా చీల్చేశారు.

Recommended Video

DMK promises metro in Coimbatore if it wins Tamil Nadu polls
ఎమ్మెల్యే ఆరుకుట్టి జంప్

ఎమ్మెల్యే ఆరుకుట్టి జంప్

పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎంపీలు ఉన్నారు. ఇంత కాలం పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న గౌండం పాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి వర్గంలో చేరిపోయి పన్నీర్ సెల్వంకు గట్టి షాక్ ఇచ్చారు.

ఇంకా ఎంత మంది ఉన్నారు ?

ఇంకా ఎంత మంది ఉన్నారు ?

తన వర్గంలోని ఎమ్మెల్యే ఆరుకుట్టి పళనిసామి వర్గంలో చేరిపోవడంతో షాక్ కు గురైన పన్నీర్ సెల్వం వెంటనే తన వర్గంలోని నాయకులతో సమావేశం అయ్యారు. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు జంప్ అవుతారా ? ఆంటూ పన్నీర్ సెల్వం ఆరా తీశారు.

వచ్చాడు, పోయాడు, పోతే పోనీ

వచ్చాడు, పోయాడు, పోతే పోనీ

పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ తనంతకు తానుగా వచ్చారు, ఆయనే వెళ్లారు, పోతేపోనీ అంటూ గౌండం పాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టిని ఊద్దేశించి మీడియాతో అన్నారు. అయితే ఒక్క ఎమ్మెల్యే చెయ్యిజారినంత మాత్రాన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పన్నీర్ సెల్వం చెప్పారు.

కేంద్రంతో నాకు ఇంకా !

కేంద్రంతో నాకు ఇంకా !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చెయ్యి జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో రాజుకున్న అసంతృప్తిని చల్లర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేంద్రంతో ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయని తన వర్గంలోని నాయకులకు పరోక్షంగా చెప్పడానికే ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారని తెలిసింది.

English summary
Former CM OPS and his camp MP's meets PM Narendra Modi at 11:30 am at Parliament.Manoj Pandian, Natham Viswanathan, Munu Sami , Maithreayan, Semmalai met PM in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X