చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ షాక్: చెప్పకుండా సైలెంట్ గా చెన్నైకి: వేటు పడితే అందరూ ఇంటికే !

గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుంగా సోమవారం చెనై చేరుకోవడంతో సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు హడలిపోతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా చెన్నై చేరుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గవర్నర్ చెన్నై చేరుకోవడంతో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం హడలిపోయింది.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు భారీ మొత్తంలో నగదు బట్వాడా చేశారని ఆరోపణలు రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళనాడులో ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిలో దాడులు చేసిన ఆదాయపన్నుశాఖ అధికారులు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మంత్రుల మీద చర్యలు తీసుకోవాలని

మంత్రుల మీద చర్యలు తీసుకోవాలని

ఐటీ శాఖ అధికారుల దాడులకు గురైన ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ తో సహ ఆదాయపన్ను శాఖ మహిళా అధికారిని బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు మంత్రుల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకున్నారని సమాచారం.

అదే జరిగితే మంత్రుల పని ఫినిష్

అదే జరిగితే మంత్రుల పని ఫినిష్

ఆర్ కే నగర్ ఓటర్లకు నేరుగా మంత్రి ఇంటి నుంచి రూ. 89 కోట్లు బట్వాడా చెల్లించారని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి విజయభాస్కర్ మీద గవర్నర్ విద్యాసాగర్ రావు కచ్చితంగా వేటువేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఎడప్పాడి పళనిసామితో చర్చించి

ఎడప్పాడి పళనిసామితో చర్చించి

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామితో చర్చించి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సోమవారం సాయంత్రం సీఎం ఎడప్పాడి పళనిసామి చెన్నైలోని రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

మంత్రికి ఉద్వాసన తప్పదా ?

మంత్రికి ఉద్వాసన తప్పదా ?

ఎడప్పాడి పళనిసామి, ఆయన వర్గంలోని సీనియర్ మంత్రులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అన్నాడీఎంకే పార్టీ (శశికళ వర్గం) నాయకులు అంటున్నారు.

ప్రతిపక్షాలు కలిసి

ప్రతిపక్షాలు కలిసి

ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీఎంకే పార్టీ నేతలు ముంబైలోని గవర్నర్ విద్యాసాగర్ రావుకు కలిసి వినతిపత్రం సమర్పించి మనవి చేశారు. ఇప్పుడు మళ్లీ చెన్నైలోని రాజ్ భవన్ లో డీఎంకే నేతలు విద్యాసాగర్ రావును కలిసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.

ఐటీ అధికారినే బెదిరించారు

ఐటీ అధికారినే బెదిరించారు

ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిలో ఐటీ సోదాలు జరిగే సమయంలో ఆదాయపన్ను శాఖ మహిళా అధికారిని బెదిరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రులు కామరాజ్, కడంబూరు రాజా, రాధాకృష్ణన్ పై చెన్నైలోని అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అందరి మీద ఒకే సారి వేటు వేస్తారా ?

అందరి మీద ఒకే సారి వేటు వేస్తారా ?

ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ తో సహ మరో ముగ్గురు మంత్రులు కామరాజ్, కడంబూరు రాజా, రాధాకృష్ణన్ పై గవర్నర్ విద్యాసాగర్ రావు ఒకే సారి వేటువేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద విద్యాసాగర్ రావు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమిళనాడు చేరుకోవడంతో అధికార పార్టీ నాయకులు హడలిపోతున్నారు.

English summary
TN Governor Vidyasagar Rao reached Chennai without any prior information. So he may take action against 4 ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X