వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రూ.246 కోట్లను డిపాజిట్ చేసిన వ్యాపారి, లెక్కలు చూపని ఆదాయం వెయ్యి కోట్లు

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత తమిళనాడు, పుదుచ్చేరిలలో సుమారు 200 మంది ఆదాయపు పన్ను పరిమితికి మించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. వివిద బ్యాంకుల్లో రూ.600 కోట్లకుపైగా డిపాజిట్లు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత తమిళనాడు, పుదుచ్చేరిలలో సుమారు 200 మంది ఆదాయపు పన్ను పరిమితికి మించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. వివిద బ్యాంకుల్లో రూ.600 కోట్లకుపైగా డిపాజిట్లు చేశారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఎవరెవరు ఎంత నగదును డిపాజిట్ చేశారనే అంశంపై ఆదాయపు పన్నుశాఖ ఆరా తీస్తోంది.అయితే ఈ ఆదాయం ఎవరికి ఎక్కడ నుండి వచ్చిందనే విషయాన్ని పరిశీలిస్తోంది.

ఆదాయపు పన్నుశాఖ నల్లధనం వివరాలను తెలుసుకొనేందుకుగాను పలు మార్గాలను కనిపెట్టింది. నల్లధనాన్ని రూపుమాపేందుకుగాను కేంద్రం పలు చర్యలను తీసుకొంటుంది.

పెద్ద నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే సమయంలో రెండులక్షలకు పైగా నగదును బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన ఖాతాలపై ఆదాయపుపన్ను శాఖ నిఘాను వేసింది. అయితే గత ఏడాది నవంబర్ 8వ, తేదికి ముందు ఆ తర్వాత ఆయా బ్యాంకుల లావాదేవీలపై కూడ బ్యాంకు పరిశీలిస్తోంది.

పరిమితికి మించి బ్యాంకుల్లో డిపాజిట్లు

పరిమితికి మించి బ్యాంకుల్లో డిపాజిట్లు

దేశంలో అత్యధికంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి దాదాపుగా రెండు వందల మంది ఆదాయపు పన్ను పరిమితికి మించి అత్యధిక స్థాయిలో బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేశారని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ మేరకు వీరు సుమారు రూ600 కోట్లను డిపాజిట్ చేసినట్టుగా ఐటి శాఖ లెక్కలను తేల్చింది.

తమిళనాడులో గ్రామాల నుండి ఎక్కువ డిపాజిట్లు

తమిళనాడులో గ్రామాల నుండి ఎక్కువ డిపాజిట్లు

తమిళనాడు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్టుగా ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది.పరిమితికి మించి తమ ఖాతాల్లో ఎక్కువ నగదును డిపాజిటు చేసినట్టు ఐటి శాఖ గుర్తించింది.చెన్నైలో కూడ కొన్ని చోట్ల అధిక మొత్తం డిపాజిట్లు వచ్చాయి. కొన్ని సబ్ అర్భన్ ప్రాంతాల్లోనూ, నగరాలకు సమీపంలోని జిల్లా కేంద్రాల్లోనూ పెద్ద మొత్తంలో పాతనోట్లు డిపాజిట్టు అయ్యాయని ఐటీ శాఖాధికారులు గుర్తించారు.

రూ.248 కోట్లను డిపాజిట్ చేసిన వ్యక్తి

రూ.248 కోట్లను డిపాజిట్ చేసిన వ్యక్తి

తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లా తిరుచెంగోడికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.248 కోట్ల పాత నోట్లను డిపాజిట్ చేశాడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలో ఆయన ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. తొలుత పెద్ద మొత్తంలో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద డిపాజిట్ చేసిన మొత్తంలో 45 శాతం పన్ను కట్టాలని ఆదాయపు పన్ను శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు.

లెక్క చూపని ఆదాయం వెయ్యి కోట్లు

లెక్క చూపని ఆదాయం వెయ్యి కోట్లు

ఈ ఏడాది మార్చి 31వ, తేది వరకు నల్ల ధనం లెక్కలను చూపాలని ఆధాయపు పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిఎంజికెవై పథకం కింద జాయిన్ అయితే నల్లధనం వివరాలను కొంత జరిమానా చెల్లించే వెసులుబాటును కేంద్రం కల్పించింది.అయితే ఇప్పటివరకు సుమారుగా వెయ్యి కోట్ల రూపాయాలను లెక్క చూపని ఆధాయం తేలిందని ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు.

English summary
A businessman from Tiruchengode at Namakkal district in Tamil Nadu got into legal trouble after depositing Rs 246 crore cash at an Indian Overseas Bank branch, said reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X