వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ కోటా పూర్తి: 3 గం.లు నిరీక్షించినా మంత్రులకు నో

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురయింది. చిన్నమ్మను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురయింది. చిన్నమ్మను కలిసేందుకు వారికి అనుమతి నిరాకరించారు.

'జయ మృతిపై ప్రకటన ఏది, ఏన్నో అనుమానాలు, శశికళది ఆవేశం''జయ మృతిపై ప్రకటన ఏది, ఏన్నో అనుమానాలు, శశికళది ఆవేశం'

మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా పళనిస్వామి, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అందులో డీ శ్రీనివాసన్, సెంగొట్టాయన్, సెల్లూర్ రాజులు కూడా ఉన్నారు.

ఈ ముగ్గురు మంత్రులు మంగళవారం నాడు శశికళను కలిసేందుకు చెన్నై నుంచి బెంగళూరు వచ్చారు. అక్కడి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అయితే వారికి అధికారులు అనుమతి నిరాకరించారు.

అందుకే అనుమతి నిరాకరణ

అందుకే అనుమతి నిరాకరణ

డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజనర్స్ ప్రకారం.. జైలులో ఉన్న ఖైదీని కలిసేందుకు వారానికి రెండు రోజులు మాత్రమే అవకాశమిస్తారు. ఈ కారణంగా శశికళను కలిసేందుకు తమిళనాడు మంత్రులకు అనుమతి నిరాకరించారు.

శశికళ కోటా అయిపోయింది

శశికళ కోటా అయిపోయింది

శశికళ వారం క్రితం జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమెను పలువురు నేతలు కలుస్తున్నారు. సోమవారం నాడు ఆమె అక్క కొడుకు, అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ కూడా కలిశారు. వరుసగా పలువురు ఆమెను కలుస్తుండటంతో ఈ వారానికి ఆమె కోటా పూర్తయింది.

3 గంటలు ఎదురు చూసిన మంత్రులు

3 గంటలు ఎదురు చూసిన మంత్రులు

ముగ్గురు మంత్రులు కూడా శశికళ కోసం మూడు గంటల పాటు నిరీక్షించారు. అయితే, నిబంధల ప్రకారం అనుమతి లేదని అధికారులు చెప్పలేదు. వచ్చే వారం వారు రావొచ్చునని చెప్పారు.

జైలు మార్పు కోసం..

జైలు మార్పు కోసం..

తనను బెంగళూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించాలని శశికళ పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్‌ జైలు అధికారుల వద్ద ఉంది. అయితే, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఇలాంటి దరఖాస్తును ప్రత్యేక కోర్టుకు ఇవ్వాలని అంటున్నారు.

English summary
The three ministers D Srivasan, Sengottaiyan and Sellur Raju had travelled from Chennai to meet Sasikala who is lodged in jail after she was convicted in the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X