వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత అంత్య‌క్రియ‌ల కోసం రాష్ట్ర‌ప‌తి ప్రణబ్ సాహ‌సం

మంగళవారం సాయంత్రం జరిగిన త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌ల‌కు స‌మ‌యానికి చేరుకోవ‌డానికి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పెద్ద సాహ‌స‌మే చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: మంగళవారం సాయంత్రం జరిగిన త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌ల‌కు స‌మ‌యానికి చేరుకోవ‌డానికి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ పెద్ద సాహ‌స‌మే చేశారు. చెన్నై వ‌ర‌కు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ల‌గ్జ‌రీ ప్లేన్ బోయింగ్ 737లో చేరుకున్న ప్ర‌ణ‌బ్‌.. అక్క‌డి నుంచి ఎయిర్‌ఫోర్స్ వాళ్లు ర‌వాణ‌కు వినియోగించే ఎంఐ-17 హెలికాప్ట‌ర్‌లో మెరీనా బీచ్‌కు వెళ్లారు.

శశికళ చేతుల్లోకి: అన్నాడీఎంకేపై సుబ్రమణ్య స్వామిశశికళ చేతుల్లోకి: అన్నాడీఎంకేపై సుబ్రమణ్య స్వామి

కాగా, ఈ హెలికాప్టర్‍‌లో బోయింగ్‌లాగా ల‌గ్జ‌రీ సీట్లు ఉండ‌వు. దీంతో ప్ర‌ణ‌బ్ ఓ బెంచ్‌పై సీట్ బెల్ట్ పెట్టుకొని ప్ర‌యాణించారు. అంత‌కుముందు ఢిల్లీ నుంచి చెన్నై రావ‌డానికి మొద‌ట ప్ర‌ణ‌బ్ బ‌య‌లుదేరినా.. విమానంలో సాంకేతిక లోపం కార‌ణంగా బ‌య‌లుదేరిన కొద్దిసేప‌టికే మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.

జయకు అత్యంత ఆప్తుడు చో రామస్వామి కన్నుమూత: రమ్యకృష్ణ మేనమామజయకు అత్యంత ఆప్తుడు చో రామస్వామి కన్నుమూత: రమ్యకృష్ణ మేనమామ

ఇంజిన్‌లో త‌లెత్తిన లోపాన్ని స‌రిచేసిన కాసేప‌టి త‌ర్వాత ప్ర‌ణ‌బ్ మ‌ళ్లీ చెన్నై బ‌య‌లుదేరారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగ‌గానే.. ఆయ‌న‌ను మెరీనా బీచ్‌కు తీసుకెళ్ల‌డానికి ఎంఐ-17 హెలికాప్ట‌ర్‌ను సిద్ధంగా ఉంచారు.

To Get To Jayalalithaa Funeral, President Pranab Mukherjee Hitches A Ride With Air Force

రాష్ట్ర‌ప‌తి స్థాయి వ్య‌క్తి ప్ర‌యాణించ‌డానికి అంత అనువుగా లేక‌పోయినా.. ప్ర‌ణ‌బ్ మాత్రం అప్ప‌టికే ఆల‌స్యం కావ‌డంతో అందులోనే అంత్య‌క్రియ‌లు జ‌రిగే ఎంజీఆర్ మెమోరియ‌ల్ వ‌ర‌కు వెళ్లేందుకు సాహసించారు. దీంతో ఆయన జయలలిత అంత్యక్రియలకు ముందే హాజరయ్యారు. జయలలిత పార్టీవదేహానికి నివాళుర్పించారు.

చంద్రబాబు ఇలాకాతో జయకు విడదీయరాని అనుబంధంచంద్రబాబు ఇలాకాతో జయకు విడదీయరాని అనుబంధం

అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రణబ్.. జయలలితకు నివాళులర్పించారు. జయ దేశ రాజకీయాల్లోనే గొప్ప నేత అని, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆమె ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ.. తమిళ ప్రజలకు సానుభూతి తెలిపారు.

English summary
President Pranab Mukherjee finally made it to Tamil Nadu Chief Minister J Jayalalithaa's funeral on Tuesday after his Air Force-flown Boeing Business Jet developed a minor technical snag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X