వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషత్వం లేని భర్తపై మహిళ అత్యాచారం కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పురుషత్వం లేని భర్తను వదిలించుకోవడానికి ఓ మహిళ తప్పుడు అత్యాచారం కేసు పెట్టింది. దాంతో తనను బెదిరిస్తున్నారని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పెట్టిన కేసును స్థానిక కోర్టు కొట్టేసింది.

పురుషత్వం లేని తన భర్తను వదిలించుకోవడానికి తాను తప్పు కేసు పెట్టినట్లు మహిళ అంగీకరించినట్లు న్యాయమూర్తి వీరేంద్ర భట్ చెప్పారు. ఆ కారణంగానే మహిళ తన తల్లిగారంటికి వెళ్లిపోయి తప్పు కేసు పెట్టిందని చెప్పారు.

To get rid of impotent husband, woman lodges false rape case

తనపై అత్యాచారం చేశారనే ఆరోపణతో పాటు తన బావ మరిది తన అసహజమైన శృంగారానికి పాల్పడ్డాడని, తన మామ తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని మహిళ కేసు పెట్టింది. విడాకులు తీసుకునేందుకు వారిపై ఒత్తిడి పెట్టేందుకే ఈ కేసు పెట్టినట్లు న్యాయమూర్తి చెప్పారు.

మహిళ భర్తను, అత్తామామలను, ముగ్గురు బావామరుదులను, ఇద్దరు వదినలను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. కేసు విచారణలో ఉండగానే అత్తింటివారితో, భర్తతో మహిళ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.

చివరకు విడాకులు పొందే విషయంలో మహిళ విజయం సాధించిందని, అలాగే తనకు భరణాన్ని కూడా సాధించుకుందని కోర్టు తెలిపింది. 2014లో ఆమె భర్తపై, అత్తింటివారిపై ఫిర్యాదు చేసింది.

English summary
A local court has acquitted a man and his family members of the charges of raping, molesting and threatening his wife, saying the woman lodged a false complaint to get rid of her “impotent” husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X