రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి, డ్రైవర్ ను కొట్టి చంపేసిన ప్రజలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

పశ్చిమ బెంగాల్: స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. విషయం గుర్తించిన స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని అతి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో జరిగింది.

మల్డా జిల్లాలోని మోలాద్రీ తులసిరామోట్రా ప్రాంతంలో స్థానిక బాలిక స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో వేగంగా వచ్చిన ట్రాక్టర్ బాలికను ఢీకొనింది. ట్రాక్టర్ చక్రాల కిందపడిన బాలిక సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది.

Tractor crushes school girl in Malda driver beaten to death

విషయం గుర్తించిన స్థానికులు ట్రాక్టర్ ను నిలిపి డ్రైవర్ ను పట్టుకుని చితకబాదేశారు. కర్రలు, రాడ్లతో దాడి చెయ్యడంతో డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. స్థానికులు ట్రాక్టర్ కు నిప్పంటించి రోడ్డు బంద్ చేసి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు నచ్చచెప్పారు.

అయితే వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని జిల్లా మెజిస్ట్రేట్ కౌశిక్ బట్టాచటర్జీ మీడియాకు చెప్పారు. స్థానికుల దాడిలో మరణించిన ట్రాక్టర్ డ్రైవర్ వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Watch 2 People Drown While Crossing Flooded Road : Caught on cam

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was beaten to death by a mob in Malda district after a school girl was crushed under the wheels of his tractor.
Please Wait while comments are loading...