వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్ ఎఫైర్: అర్థనగ్నంగా వీధిలో దంపతుల పరేడ్

|
Google Oneindia TeluguNews

Madhya Pradesh
ధార్/ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంగా అనుమానించిన ఖోకారియా గ్రామస్తులు అదే గ్రామంలోని దంపతులపై దాడి చేసి వారికి నల్లరంగు పూసి అర్ధనగ్నంగా వీధుల్లో ఊరేగించారు. కాగా ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దామ్నోద్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ముఖేష్ ఇజార్ధార్‌తోపాటు ఓ ఎస్ఐ, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఇండోర్ రేంజ్ ఐజీ విపిన్ మహేశ్వరి మీడియాకు తెలిపారు. ఘటనకు సంబంధమున్న 20మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని దామ్నోద్ పిఎస్ పరిధిలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

ఆ దంపతులది వివాహ బంధం కాదనే అనుమానంతో వారిపై దాడి చేసిన గ్రామస్తులు అర్ధనగ్నంగా చేసి ఖోకారియా, బల్వారి, బయాదిపుర గ్రామాల మీదుగా వారిని ఊరేగించారు. గ్రామస్తులు బాధిత వ్యక్తిపై స్టీలు పళ్లెం, ముళ్ల కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత వారిద్దర్నీ ఓ చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు వారి ముఖానికి, శరీరానికి నల్లరంగును పూశారు.

ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ఆ మహిళను బాధిత గిరిజన వ్యక్తి వివాహం చేసుకోవడాన్ని స్థానికంగా పంచాయతీ నిర్వహించిన పెద్దలు ఒప్పుకోకపోవడంతో గ్రామస్తులు ఈ విధమైన శిక్షను వారికి విధించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధమున్న 20మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గాయాలపాలైన బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు చెప్పారు. బాధితులకు తీవ్రమైన గాయాలేమి కాలేదని పోలీసులు తెలిపారు.

English summary
Four policemen were suspended for negligence of duty after a tribal man and a married woman were allegedly beaten up and their faces blackened by Khokariya villagers who disapproved of a relationship between the two, police said here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X