వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మద్దతు: 22 ముస్లీం కుటుంబాలపై వేటు: రంజాన్, మసీద్ లో నమాజ్ కు నో ఎంట్రీ !

|
Google Oneindia TeluguNews

త్రిపుర: ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెలుతున్నారని ఆకర్షితులైన ముస్లీంలు బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన కుటుంబ సభ్యులను రంజాన్ పండుగ సందర్బంగా నమాజ్ చెయ్యడానికి వీళ్లేదని అడ్డుకున్నారు.

త్రిపురలోని శాంతిబజార్ లోని మధ్యలయాటిల్లా ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. మధ్యయాటిల్లా ప్రాంతంలో నివాసం ఉంటున్న 22 ముస్లీం కుటుంబ సభ్యులు ఇటీవలే బీజేపీ పార్టీలో చేశారు. రంజాన్ పండుగ సందర్బంగా శుక్రవారం వీరు నమాజ్ చెయ్యడానికి మసీదు దగ్గరకు వెళ్లారు.

Tripura: 22 Muslim families denied entry in mosque after joining BJP.

ఆ సందర్బంలో సీపీఎం పార్టీకి చెందిన నాయకులు, ఇమామ్ మీరు బీజేపీలో చేరారని, మసీద్ లో నమాజ్ చెయ్యడానికి వీళ్లేదని వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు మసీద్ దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బిప్లాబ్ డబ్ మాట్టాడుతూ మా పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని మసీద్ లోకి అనుమతించలేదని తనకు తెలిసిందని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి మసీద్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తామని అన్నారు. బీజేపీలో చేరిన 22 ముస్లీం కుటుంబాలు గతంలో సీపీఎం కార్యకర్తలుగా పని చేశారని తెలిసింది.

English summary
Of the 25 Muslim families from Madhyatilla area in south Tripura district, 22 families who recently joined the BJP were restricted from entering the local mosque by the CPM leaders and the imam, in the holy month of Ramadan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X