వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌నాథ్ హామీ: టీఆర్ఎస్ ఎంపీలు హ్యాపీ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాదుపై అధికారాల విషయంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన హామీతో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు ఆనందంగా ఉన్నట్లు కనిపించారు. హైదరాబాద్ శాంతిభద్రతలపై అధికారాలను గవర్నర్‌కు అప్పగించకూడదని వారు రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఎంపీ కె. కేశవరావు నేతృత్వంలో 8 మంది ఎంపీలు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2014 పునర్విభజన చట్టంలో సెక్షన్8లో పేర్కొన్న మేరకు హైదరాబాద్‌పై గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలను వ్యతిరేకిస్తూ ఓ నివేదికను ఎంపీలు రాజ్‌నాథ్‌కు ఇచ్చారు.

తాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను హరించబోమని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు టిఆర్ఎస్ ఎంపీలు భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో చెప్పారు. మిగతా 28 రాష్ట్రాలకు మాదిరిగానే తెలంగాణకు కూడా అన్ని అధికారాలు ఉంటాయని మంత్రి చెప్పినట్లు వారు తెలిపారు. చట్టప్రకారమే గవర్నర్ అధికారాలు తీసుకుంటారని, ముఖ్యమంత్రి అధికారాలు తగ్గించబోమని రాజ్‌నాథ్ సింగ్ చెప్పినట్లు వారు తెలిపారు.

గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులను హరించడమేనని వారు రాజ్‌నాథ్‌ సింగ్‌తో చెప్పారు. సెక్షన్ - 8 కింద రాష్ట్రాధికారాలను తీసుకోవడం సరి కాదని కేశవరావు అన్నారు. ఎన్డియే ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని ఆయన కోరారు.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేశవరావుతో పాటు ఇతర ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, బీవీ పాటిల్, కవిత, బాల్కాసుమన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్ సమావేశంలో పాల్గొన్నారు.

రాజ్‌నాథ్‌తో టిఆర్ఎస్ ఎంపీలు

రాజ్‌నాథ్‌తో టిఆర్ఎస్ ఎంపీలు

హైదరాబాదు శాంతిభద్రతలపై అధికారం గవర్నర్‌కు ఇవ్వకూడదని కోరడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.

రాజ్‌నాథ్‌త టీఆర్ఎస్ ఎంపీలు

రాజ్‌నాథ్‌త టీఆర్ఎస్ ఎంపీలు

విభజన చట్టం ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ టీఆర్ఎస్ ఎంపీలకు స్పష్టం చేశారు.

రాజ్‌నాథ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు

రాజ్‌నాథ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు

సెక్షన్ 8లో ఉన్న అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్) కు సంబంధించిన అంశంలో గవర్నర్ స్వతంత్య్రంగా నిర్ణయం తీసుకోవడంపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని వారు తెలిపారు.

రాజ్‌నాథ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు

రాజ్‌నాథ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు

పునర్‌విభజన చట్టంలో ఉన్నటువంటి అధికారాలను మార్పులు చేసేదిలేదని, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలు అలాగే ఉంటాయని, తగ్గించబోమని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీలకు రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MPs, who met, home minister Rajanth Singh, under the leadership of K Keshav Rao expressed satisfaction with later's promise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X