వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సస్పెన్స్ కు తెర: అన్నాడిఎంకె అభ్యర్థి దినకరన్ నామినేషన్ ఓకే

ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సస్పెన్స్ కు తెరపడింది. ఈ స్థానంలో అన్నాడిఎంకె నుండి బరిలోక దిగుతున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటివి దినకరన్ నామినేషన్ ను అధికారులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సస్పెన్స్ కు తెరపడింది. ఈ స్థానంలో అన్నాడిఎంకె నుండి బరిలోక దిగుతున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటివి దినకరన్ నామినేషన్ ను అధికారులు అంగీకరించారు.

దినకరన్ నామినేషన్ పత్రాలను తొలుత రిటర్నింగ్ అధికారి హోల్డ్ లో పెట్టారు. దీంతో అన్నాడిఎంకె వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై తమిళనాడు రాజకీయపార్టీలన్నీ కూడ ఆసక్తిగా ఈ పరిస్థితిని గమనించాయి. అయితే సుదీర్ఘ పరిశీలన తర్వాత దినకరన్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంగీకరించారు.

TTV Dinakaran's nomination accepted after prolonged suspense

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, డిఎంకె నాయకులు కూడ దినకరన్ పై ఫెరా కేసు విషయాన్ని ప్రస్తావించారు. ఫెరా కేసులో దినకరన్ కు శిక్ష పడిన విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద ప్రస్తావించారు. అంతేకాదు ఆయన పౌరసత్వం విషయమై సమస్యలు కూడ ఉన్నాయని వారు ప్రస్తావించారు.

పన్నీర్ సెల్వంతో పాటు డిఎంకె నాయకులు దినకరన్ నామి,నేషన్ పై చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారి నాయర్ పరిశీలన చేశారు. తర్వాత ఈ నామినేషన్ ను అంగీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

శుక్రవారం ఉదయమే డిఎంకె అభ్యర్థి మరుదూరు గణేష్, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన మధుసూధన్ నామినేషన్లకు కూడ సక్రమమేనని ఎన్నికల అధికారి ప్రకటించారు.శరత్ కుమార్ పార్టీకి చెందిన అభ్యర్థి నామినేషన్ ను రిజెక్ట్ చేసినట్టు ఆయన చెప్పారు.

English summary
AIADMK candidate TTV Dinakaran's nomination for the upcoming R K Nagar bypoll was accepted after prolonged suspense. The nomination that was kept on hold by the returning officer was finally accepted on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X