వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్వీస్ట్: కమల్ హాసన్ మద్దతు కోరుతున్న పన్నీర్ సెల్వం వర్గం, అదే జరిగితే శశికళ ఫినిష్ !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం అయోమయంలో పడిపోయింది. ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నా విలీనం విషయంలో పన్నీర్ సెల్వం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం అయోమయంలో పడిపోయింది. ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నా విలీనం విషయంలో పన్నీర్ సెల్వం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. పన్నీర్ సెల్వం చేసిన రెండు డిమాండ్ల విషయంలో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి క్లారిటీ ఇవ్వకపోవడంతో విలీనం చర్చలకు బ్రేక్ పడుతోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా విద్యాసంస్థకు తాళం, రూ. 10 కోట్లు అద్దె చెల్లించలేదంట ?సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా విద్యాసంస్థకు తాళం, రూ. 10 కోట్లు అద్దె చెల్లించలేదంట ?

ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం మరో కొత్త నినాదంతో ముందుకు వచ్చింది. తమిళనాడు ప్రజలకు మంచి చెయ్యాలని కొంత కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కమల్ హాసన్ మాకు మద్దతు ఇవ్వాలని పన్నీర్ సెల్వం వర్గంలోని కీలకనేత, మాజీ మంత్రి పాండియరాజన్ మనవి చేశారు.

కమల్ హాసన్ విమర్శలు

కమల్ హాసన్ విమర్శలు

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) ప్రభుత్వం మీద కొంత కాలంగా కమల్ హాసన్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల కష్టాలు తీర్చకుండా తమ పదవులు కాపాడుకోవడానికి సీఎం, మంత్రులు పాకులాడుతున్నారని కమల్ హాసన్ మండిపడ్డారు.

మీరు సినిమాలు తీసుకోండి !

మీరు సినిమాలు తీసుకోండి !

మీరు సినిమాలు తీసుకోకుండా ప్రభుత్వం విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, మీ పని మీరు చూసుకోండి మాపని మేము చూసుకుంటామని కొందరు మంత్రలు కమల్ హాసన్ మీద మండిపడ్డారు. ఇంతటితో ఈ వివాదం సమసిపోలేదు.

కమల్ హాసన్ దెబ్బకు ?

కమల్ హాసన్ దెబ్బకు ?

మీ అవినీతి బండారం అంతా బయటపెడుతామని, అందుకు నా అభిమానులు సిద్దంగా ఉన్నారని కమల్ హాసన్ పలువురు మంత్రులకు ఘాటుగానే సమాధం ఇవ్వడంతో ఆ మంత్రులు వెనక్కితగ్గారు. కమల్ హాసన్ అభిమానుల దెబ్బకు పలువురు మంత్రులు హడలిపోయారు.

ధర్మయుధ్దానికి మద్దతు

ధర్మయుధ్దానికి మద్దతు

ఎడప్పాడి పళనిసామి వర్గాన్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు చేస్తున్నది. మేము చేస్తున్న ధర్మయుధ్దానికి కమల్ హాసన్ మద్దతు ఇస్తే తమిళనాడు ప్రజలకు మంచి జరుగుతోందని పన్నీర్ సెల్వం వర్గంలోని మాజీ మంత్రి పాండియరాజన్ అన్నారు.

ప్రజలకు మంచి జరగాలంటే ?

ప్రజలకు మంచి జరగాలంటే ?

చెన్నైలో మీడియాతో మాట్లాడిన పాండియరాజన్ కమల్ హాసన్ నిజంగా తమిళ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నారని, అందుకే ఆయన ప్రభుత్వం మీద అక్షింతలు వేశారని వివరించారు. కమల్ హాసన్, ఆయన అభిమానులు మేము చేస్తున్న ధర్మయుధ్దానికి మద్దతు ఇవ్వాలని మనవి చేశారు.

చెప్పింది చెయ్యండి

చెప్పింది చెయ్యండి

విలీనం విషయంలో మేము చేసిన రెండు డిమాండ్లకు పళనిసామి అంగీకరిస్తేనే ముందుకు వస్తామని పాండియరాజన్ కచ్చితంగా తేల్చి చెప్పారు. శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా దూరం పెట్టాలని, జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పారు.

ఒక్కటి కాదు మావి 18 సభలు

ఒక్కటి కాదు మావి 18 సభలు

మదురై జిల్లాలో టీటీవీ దినకరన్ బహిరంగ సభ సక్సస్ అయ్యింది కదా అని మీడియా ప్రశ్నిస్తే ఒక్క సభ సక్సస్ అయ్యిందని చంకలు గుద్దుకుంటున్నారని, మేము 18 బహిరంగ సభలు నిర్వహించామని, ప్రజలు బ్రహ్మరథం పట్టారనే విషయం మీకు కూడా తెలుసు కదా అని మాజీ మంత్రి పాండియరాజన్ మీడియాతో అన్నారు.

English summary
The AIADMK (Puratchi Thalaivi Amma) group led by former chief minister O Panneerselvam has sought the support of actor Kamal Haasan, who is lately coming down heavily on the AIADMK (Amma) government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X