వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టుకుంటే బట్టలు, బైక్ వదిలేసి పరారైన దొంగ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో చైన్ స్పాచింగ్ లు చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది. స్థానికులు సహకరించి నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించినా పోలీసులకు మాత్రం అదృష్టం తలుపుతట్టలేదు.

గురువారం ఉదయం 7 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులతో పాటు 20 మంది పోలీసులు గస్తి తిరుగుతున్నారు. ఆ సందర్బంలో దేవాలయం దగ్గర బైక్ లో సంచరిస్తున్న వ్యక్తి బంగారు గొలుసులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు వెంటనే చీతా వాహనంలో సంఘటనా స్థలానికి బయలుదేరారు. అదే సమయంలో విషయం పసిగట్టిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించి బైక్ వదిలేసి పరుగు తీశాడు. తరువాత వాకింగ్ చేస్తున్న వారు అతనిని వెంబడించారు.

చివరికి అతని షర్టు కాలర్ వెనుక నుండి పట్టుకున్నారు. అంతే నిందితుడు షర్టుకు ఉన్న అన్ని బటన్ లు లాగేసి షర్టు వదిలి పరారైనాడు. స్థానికులకు షర్టు అందులో ఉన్న మొబైల్ మాత్రం చిక్కింది. తెలుగు సినిమాలలో లాగా చివరిలో పోలీసులు అక్కడి వెళ్లారు.

Two back to back chain snatching incidents took place in the Bangalore city

బైక్, షర్టు, షర్టులో ఉన్న మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అదే విధంగా రామమూర్తినగర, వర్తూరు పోలీస్ స్టేషన్ లపరిధిలో వెంట వెంటనే రెండు చైన్ స్నాచింగ్ లు జరిగాయి.

English summary
Two back to back chain snatching incidents took place in the Bangalore city on Thursday, July 2, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X