వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: మమతా ఇంటి ముందు మావోయిస్టుల సంచారం, ఆయుధాలు సీజ్

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటి సమీపంలో మావోయిస్టులు(నక్సల్స్‌) తిరుగుతూ కన్పించడం స్థానికంగా కలకలం రేపింది. కోల్‌కతాలోని హరీశ్‌ ఛటర్జీ వీధిలో గల సీఎం నివాసం ముందు సోమవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించారు.

వారిని గమనించిన పోలీసులు వెంటనే అరెస్టు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తులను విచారించగా.. వారు మావోయిస్టు గ్రూప్‌కు చెందిన వారిగా తెలిసింది. తాము సీఎం ఎదుట లొంగిపోయేందుకు వచ్చామని వారు పోలీసులకు తెలిపారు.

Two Suspected Maoists Arrested Outside CM Mamata Banerjee's Residence

కాగా, వారి వద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా ఉన్నాయి. వాటిని పోలీసులకు అందజేశారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు ఓ సీనియర్ పోలీసుల అధికారి తెలిపారు. ఇప్పటికే స్థానిక పోలీసులతో దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. మమత బెనర్జీ జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు.

English summary
Two suspected Maoists were arrested on Monday after they were seen lingering furtively around West Bengal Chief Minister Mamata Banerjee's residence on Harish Chatterjee Street, Kalighat in South Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X