వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రకాల రూ.500 నోట్లు!? నోట్ల ముద్రణలోనూ స్కామ్? ప్రతిపక్షాలకు మరో ఆయుధం

ప్రభుత్వం రెండు రకాల రూ.500 కొత్త నోట్లు ముద్రించిందనే ప్రతిపక్ష పార్టీల ఆరోపణలతో మంగళవారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వం రెండు రకాల రూ.500 కొత్త నోట్లు ముద్రించిందనే ప్రతిపక్ష పార్టీల ఆరోపణలతో మంగళవారం రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో కాంగ్రెస్‌ నేతలు వేర్వేరు పరిమాణాలు, డిజైన్లలో ఉన్న కొత్త రూ. 500 నోట్లను చూపిస్తూ.. ఇలా రెండు రకాలుగా ముద్రించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అవి ఒకటి పార్టీ కోసం, మరొకటి ప్రభుత్వం కోసమే ముద్రించారని వారు ఆరోపించారు. 'మేం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా రెండు రకాల నోట్లు ముద్రించలేదు. కుట్రపూరితంగానే రూ.500, రూ. 2000 నోట్లను రెండు రకాల్లో ముద్రించారు. ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం..' అని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఆరోపించారు.

Two types of Rs 500 notes? Congress calls it ‘scam of the century’, disrupts RS

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ మాట్లాడుతూ.. 'ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో ఇప్పుడు అర్థమైంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రెండు రకాల పరిమాణాలు, డిజైన్లలో కొత్త నోట్లను ముద్రించింది' అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వాదనకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా మద్దతు పలకడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

కొత్త నోట్లపై కాంగ్రెస్‌ ఆరోపణలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఘాటుగా బదులిచ్చారు. 'అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ సభ సమయాన్ని వృథా చేస్తున్నారు. జీరో అవర్‌లో ఎన్నో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. సమయాన్నంతా నాశనం చేస్తున్నారు..' అని ఆయన మండిపడ్డారు. జైట్లీ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ సభ్యులు సభ మధ్యలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు.. వేర్వేరు ప్రాంతాల్లోని ముద్రణా కార్యాలయాల్లో నోట్లను ముద్రించడం వల్ల వాటి పరిమాణం, డిజైన్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చుగానీ, ప్రభుత్వం 2 రకాల నోట్లను ముద్రించమని ఆదేశాలు ఇవ్వలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

English summary
The Rajya Sabha saw four adjournments within its first hour of proceedings on Tuesday as the Congress, with support from the Trinamool Congress and the Janata Dal (United), created a ruckus over the printing of two kinds of 500 and 2000-rupee notes, calling it the “biggest scam of this century”. Slogan-shouting Congress members trooped into the well even as Leader of the House and finance minister Arun Jaitley said the opposition party has been raising “frivolous” issues without giving notices to stall Zero Hour proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X