బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ రేప్: 'ముమ్మాటికీ తప్పు ఉబెర్ క్యాబ్ సర్వీసుదే'... ఇన్స్‌స్టావాణి పోల్‌లో భారతీయులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27 ఏల్ల మహిళపై ఉబెర్ క్యాబ్ సర్వీసుకి చెందిన డ్రైవర్ శివకుమార్ డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది.

దీంతో దేశంలో ఉన్న క్యాబ్ సర్వీసులపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. "ఉబెర్" అంతర్జాతీయంగా పేరొందిన క్యాబ్ సర్వీసు. ఢిల్లీలో ఉబెర్ క్యాబ్‌లో ఈ ఘటన జరగడంతో యావత్ దేశం మొత్తం ఉబెర్ క్యాబ్ సర్వీసు ప్రయాణీకుల భద్రతకు ఏ మాత్రం జాగ్రతలు తీసుకోలేదని అంటున్నారు.

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిర్వహించిన ఇన్‌స్టావాణి పోల్‌కి 1118 స్పందించారు. వీరంతా ఉబెర్ క్యాబ్ సర్వీసు భద్రతను ప్రశ్నించారు. మహిళపై జరిగిన అత్యాచారానికి ఉబెర్ క్యాబ్ సర్వీసుని బాధ్యుల్ని చేయాలని వారు పోల్ ద్వారా తెలియజేశారు.

ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తా, చెన్నైలలో నిర్వహించిన ఈ పోల్‌లో 76 శాతం మంది ఈ ఘటనకు ఉబెర్ క్యాబ్ సర్వీసుని నిందించారు. ఉబెర్ క్యాబ్ సర్వీసు ప్రయాణీకుల పట్ల సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా 81 శాతం మహిళలు ముమ్మాటికీ ఈ ఘటనకు బాధ్యులు ఉబెర్ క్యాబ్ సర్వీస్ అంటూ నిందించారు. రాబోయే కాలంలో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే ఉబెర్ క్యాబ్ సర్వీసు ఎంచుకుంటారా అన్న ప్రశ్నకు గాను 59 శాంత మంది ఓకె చెప్పగా... 62 శాతం మంది ప్రయాణం చేసేందుకు ఉబెర్ క్యాబ్ సర్వీసు ఎంత మాత్రం క్షేమం కాదని ఓటు చేశారు. 41 శాతం మంది మాత్రం ఉబెర్ సంస్ధ క్యాబ్ సర్వీసులను కొనసాగిస్తామన్నారు.

ఢిల్లీలో ఈ ఘటన జరిగిన తర్వాత ఉబెర్ క్యాబ్ సర్వీసులను నిషేధించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాగం నుంచి లైసెన్స్ పొందని వెబ్, యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసు సేవలను నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే ఇంటర్నెట్ ఆధారిత ఉబెర్ సేవలను దేశవ్యాప్తంగా నిషేధించామని తెలిపారు.

ఐతే ఈ నిర్ణయం పట్ల 48 శాతం మంది ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరైందేనని ఓటు చేశారు. 52 శాతం మంది నిరాకరించారు. ఐతే 51 శాతం మహిళలు మాత్రం ఈ నిర్ణయం సరైందేనంటూ ఓటు చేశారు.

ఢిల్లీలో జరిగిన ఈ అత్యాచార ఘటనతో మన దేశంలో మహిళల భద్రత పట్ల మరోసారి చర్చించాల్సిన తరుణం వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఈ అత్యాచార ఘటనపై స్పందిస్తున్నారు. పోల్ విషయంలో మిశ్రమ స్పందన వచ్చినా... మహిళలు మాత్రం ఉబెర్ క్యాబ్ సర్వీసుని దేశ వ్యాప్తంగా నిలిపివేయడమే మంచిదంటున్నారు.

ఢిల్లీ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌పై గతంలో కూడా క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఆ డ్రైవర్ 2013లో కూడా అరెస్టయ్యాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్ పురిలో అతని పైన అత్యాచారం కేసు నమోదయింది. ఈ కేసులో అతను జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చాడు. అంతేకాదు, అతను 2006 కూడా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టయ్యాడు.

కాగా, శివకుమార్ యాదవ్ 2011లో బార్ డ్యాన్సర్ పైన అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అప్పుడు అతను ఏడు నెలల పాటు జైలులో ఉన్నాడు. అనంతరం ఈ కేసులో అతను బయటకు వచ్చాడు. బాధిత మహిళ, నిందితుడి మధ్య రాజీ కుదరడంతో అతను బయటకు వచ్చాడు. 2011లో దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇంతటి నేర చరిత్ర ఉన్న డ్రైవర్‌ను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ఉబెర్ క్యాబ్ సర్వీసు ఎలా విధుల్లోకి తీసుకుందని మహిళలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు.

Uber is responsible for the delhi rape: Indians say on instavaani poll

తమ డ్రైవర్ల నేపథ్యానికి సంబంధించి పోలీసు ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయంటూ తప్పుడు సమాచారం ఇచ్చి ఉబెర్ వినియోగదారులను మోసం చేసిందని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్) తదితర అభియోగాలు మోపారు. ఇక మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి కేసులో 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా ఢిల్లీ పోలీసులకు, ఉబెర్ సంస్థకు కమిషన్ నోటీసులు జారీచేసింది.

ఈ ఘటన తర్వాత ఉబెర్ క్యాబ్ సర్వీస్ ట్యాగ్ లైన్ చూసి అందరూ నవ్వుతున్నారు. అందుకు కారణం 'సురక్షితమైన, నమ్మకమైన, సరసమైన రైడ్' అంటూ ఉబెర్ క్యాబ్ సర్వీసు తన టాగ్ లైన్‌ను పెట్టుకుంది. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణం అందించలేని క్యాబ్ సర్వీస్ ఉన్నా ఒకటే? మూసి వేసినా ఒకటేనని ఇన్స్‌స్టావాణి భారతీయులు అన్నారు.

English summary
The rape of a 27-year-old woman by an Uber cab driver in north Delhi on Friday night, Dec 5 has put the spotlight on cab booking companies and their practices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X