వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో మరో ఘోరం : శవం ఎముకలు విరిచి మోసుకెళ్లారు..

|
Google Oneindia TeluguNews

బలసోర్ : పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. చేతిలో చిల్లిగవ్వలేని స్థితిలో.. భార్య శవాన్ని తన భుజాలపైనే ఏకంగా 12 కి.మీ వరకు ఓ భర్త మోసుకుంటూ వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన ఒరిస్సాలోనే ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది.

అంబులెన్స్ అందుబాటులో లేని కారణంతో.. చనిపోయిన ఓ వృద్దురాలి మృతదేహాన్ని విరగొట్టి, ముక్కలు చేసి ఓ సంచిలో మూటగట్టి.. ఆపై వెదురు బొంగులకు వేలాడదీసి మోసుకుంటు వెళ్లారు ఇద్దరు ఆసుపత్రి ఉద్యోగులు. చనిపోయిన తర్వాత మృతదేహం బిగుసుకుపోవడంతో.. ఆ శవాన్ని ఎలా తరలించాలో అర్థంగాక.. ఎముకలు విరగొట్టి ముక్కలు చేసినట్లుగా చెబుతున్నారు సదరు ఉద్యోగులు.

Unable to carry body, Odisha workers break woman’s bones, stuff it in bag

సలామణి బారిక్ అనే 76 ఏళ్ల వృద్దురాలు గత బుధవారం రైలు ప్రమాదంలో చనిపోవడంతో.. పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆమెను స్థానిక బలసోర్ ఆసుపత్రికి తరలించారు. అయితే సమయానికి పోస్ట్ మార్టమ్ చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడం.. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కూడా లేకపోవడంతో.. ఎలాగోలా శవాన్ని అక్కడినుంచి రైల్వే స్టేషన్ కు తరలించాల్సిందిగా ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు చెప్పారు ఆసుపత్రి సిబ్బంది.

ఈ విషయంలో తాను నిస్సహాయుడిగా ఉన్నానని.. తన తల్లి ఎముకలు విరగొట్టి తీసుకెళుతుంటే.. ధీనంగా చూస్తుండిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు వ్యాధిగ్రస్తుడైన మృతరాలి కొడుకు రబీంద్ర బారిక్. విషయం తెలుసుకున్న మానవ హక్కుల కమిషన్ దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రైల్వే పోలీసులతో పాటు జిల్లా అధికారులను ఆదేశించింది.

English summary
In a shocking case of apathy, a worker at a government hospital in Odisha broke the bones of an old woman’s dead body and stuffed it in a bag as there was no ambulance to carry the corpse to the railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X