వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ అసెంబ్లీ : ఆ తొమ్మిది స్థానాలు ఎస్పీకి సవాలే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ సహా ముగ్గురు మంత్రులు పోటీచేస్తున్న స్థానాల్లో గెలుపు కీలకం కానున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ సహా ముగ్గురు మంత్రులు పోటీచేస్తున్న స్థానాల్లో గెలుపు కీలకం కానున్నది. ముగ్గురు మంత్రుల్లో ఒకరికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఉద్వాసన పలికారు.

రాష్ట్ర రాజధాని నగరం లక్నో జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీ తప్పనిసరిగా నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. విపక్ష బీజేపీ, బీఎస్పీలు ఈ స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. లక్నో సెంట్రల్, లక్నో కంటోన్మెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడంతో కమలనాథుల్లోనూ అసమ్మతి నెలకొంది.

UP election- SP fighting tooth and nail for 9 prestige seats in Lucknow

అపర్ణా వర్సెస్ రీటా బహుగుణ

లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణను బీజేపీ అభ్యర్థిగా నిలిపింది. మరోవైపు ఈ స్థానం నుంచి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బరిలో నిలిచారు. సుపరిపాలన అందిస్తానని చెప్తున్న బీఎస్పీ అధినేత మాయావతి కూడా లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి యోగేశ్ దీక్షిత్‌కు టిక్కెట్ కేటాయించారు.

లక్నో సెంట్రల్ నుంచి రాష్ట్ర మంత్రి రవిదాస్‌కు గట్టిపోటీ

లక్నో సెంట్రల్ స్థానంలో కీలక పోటీ ఎదురు కానున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి రవిదాస్ మెహ్రోత్రా కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరూఫ్ ఖాన్ బరిలో నుంచి తప్పుకునేందుకు నిరాకరించడంతో ఇరు పార్టీల మధ్య స్నేహ పూర్వక పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీఎస్పీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ బ్రిజేష్ పాఠక్ కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన ఇంతకుముందు లక్నో యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.

సరోజినీ నగర్ నుంచి స్వాతిసింగ్
సరోజిని నగర్ నుంచి బీజేపీ మహిళామోర్చానేత స్వాతిసింగ్ పోటీచేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ ఏనాడు గెలువలేదు. అయితే సమాజ్ వాదీ పార్టీ మాత్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే శార్దా ప్రసాద్ శుక్లాకు టిక్కెట్ నిరాకరించిన సమాజ్ వాదీ పార్టీ.. యూపీ సీఎం అఖిలేశ్ బంధువు అనురాగ్ యాదవ్ కు బీ ఫామ్ ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే శార్దా ప్రసాద్.. పార్టీ మారిపోయారు.

UP election- SP fighting tooth and nail for 9 prestige seats in Lucknow

ఆర్ఎల్డీ నుంచి సిట్టింగ్ ఎస్పీ ఎమ్మెల్యే పోటీ

సరోజీని నగర్ స్థానం నుంచి అజిత్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ (ఆర్ఎల్డీ) నుంచి పోటీ చేయడం అధికార పార్టీకి తలనొప్పే. ఇక బీజేపీ నుంచి తిరుగుబాటు చేసిన రుద్రదామన్ దాస్ అలియాస్ బబ్లూ శివసేన తరపున పోటీ చేయడం వల్ల బీజేపీ విజయావకాశాలు అనుమానమేననంటున్నారు. 2012 ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన బబ్లూ 41,333 ఓట్లు లభించాయి. ఇవి బీజేపీ అభ్యర్థి వీరేంద్ర తివారీకి 29,339 ఓట్లతో మూడస్థానంలో మరోవైపు బీఎస్పీ శంకర్ సింగ్ అలియాస్ శంకరీకి టిక్కెట్ కేటాయించింది.

21 నియోజకవర్గాల్లో ముగ్గురి కంటే ఎక్కువ నేరస్తులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోదశ పోలింగ్ జరిగే 69 స్థానాల్లో పోటీ చేస్తున్న 811 మంది అభ్యర్థుల్లో 250 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. 110 మంది అభ్యర్థులపై క్రిమినల్ నేరాభియోగాలు నమోదయ్యాయి. 110 మందిలో 82 మందిపై తీవ్రమైన నేర అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. ఏడుగురు అభ్యర్థులు హత్యానేరానికి పాల్పడినట్లు, 11 మందిపై హత్యాయత్నం నేరాలు నమోదయ్యాయి. ఆరుగురు అభ్యర్థులు దాడులు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, మరో ఐదుగురు కిడ్నాపింగ్ తదితర దాడులకు పాల్పడినట్లు వారు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. బీజేపీ నుంచి 68 మంది అభ్యర్థుల్లో 21, బీఎస్పీకి చెందిన 21 మంది, ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో ఐదుగురు, ఎస్పీలో 13, కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు, 225 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 13 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. 21 నియోజకవర్గాల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేరస్తులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

UP election- SP fighting tooth and nail for 9 prestige seats in Lucknow

250 మంది కోటీశ్వరులు

811 మంది అభ్యర్థుల్లో 250 మంది (31%) కోటీశ్వరులు. 67 స్థానాల్లో బీఎస్పీ, 61 నియోజకవర్గాల్లో బీజేపీ, 51 చోట్ల ఎస్పీ, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, ఆర్ఎల్డీలో 13 మంది అభ్యర్థులు కోటీశ్వర్లు. సగటున ఒక్కో అభ్యర్థి రూ.1.61 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సగటున రూ.6.20 కోట్లు, బీజేపీ అభ్యర్థుల్లో 3.79 కోట్లు, బీఎస్పీ అభ్యర్థులో సగటున 4.18 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అధికార ఎస్పీలో సగటున రూ.5.70 కోట్లు, 225 మంది స్వతంత్ర అభ్యర్థులు 72.25 లక్షల వ్యక్తిగత ఆస్తులు కలిగి ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు మాత్రం తమకు ఎటువంటి ఆస్తులు లేవని ప్రకటించారు.

English summary
Ruling Samajwadi Party is facing a tough battle as it tries to retain the seven Assembly seats it had won last time out of nine in Uttar Pradesh capital, while BJP and BSP queer the pitch. The two other seats were shared by BJP and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X