వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ మందిర నిర్మాణం: యూపీ బిజెపి మెనిఫెస్టోలో సంచలనం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అయోధ్యలోని రామమందిర నిర్మాణం హా ట్ టాపిక్‌గా మారింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అయోధ్యలోని రామమందిర నిర్మాణం హా ట్ టాపిక్‌గా మారింది. ఇందుకు ఓ కారణంగా కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(2017)ల నేపథ్యంలో తమ పార్టీ మెనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో తాము అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం
రామమందిర నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.

ఒక్కసారి బిజెపి మేనిఫెస్టోలోని కీలక అంశాలను పరిశీలించినట్లయితే..

- యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అనంతరమే భారత చట్ట ప్రకారం రామ మందిరం నిర్మాణం చేపడతాం.
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం రూ. 500 కోట్లు..
- చిన్న, సన్నకారు రైతులకు జన కళ్యాణ్ సంకల్ప్ పాత్ర పేరుతో 0శాతంతో రుణాలు. ల్యాప్‌టాప్‌ల పంపిణీ, సంవత్సరం 1జీబీ డేటా ఉచితం

UP elections: Ram Temple will be a reality if BJP wins says manifesto
- అధికారంలోకి వచ్చిన 45రోజుల్లో గుండాలు, నేరగాళ్లు జైల్లో ఉంటారు.
- యూపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్. 24గంటలపాటు విద్యుత్ సరఫరా. పేదలకు తక్కువ ధరకే విద్యుత్.
- మత కలహాలు చేసుకోకుండా జిల్లా స్థాయిలో బీజేపీ బృందాలు ఏర్పాటు చేస్తుంది.
- 8వ, 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను తొలగిస్తాం. దీంతో అవినీతికి అవకాశం ఉండదు.
- ఇంటర్ వరకు ఉచిత విద్య. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఫీజు మాఫీ ఉంటుంది.
- బాలికల కోసం ప్రత్యేక పథకాల ఏర్పాటు. పాఠశాల, కళాశాల విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు యాంటీ రోమియో దల్ ఏర్పాటు.
- 120 రోజుల్లో చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు.

ప్రభుత్వం మాదే

యూపీలో త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. యూపీలో 2/3 మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

యూపీలో అఖిలేష్ ప్రభుత్వం మారే వరకు అభివృద్ధి చెందదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే యూపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చి దిద్దుతామన్నారు. గత పదిహేనేళ్లుగా యూపీలో అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు. యూపీలో శాంతిభద్రతలు లోపించాయని దుయ్యబట్టారు.

English summary
The BJP's National President Amit Shah on Saturday released its manifesto for Uttar Pradesh Assembly elections 2017 in which it promised the construction of the Ram Temple at Ayodhya as per the law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X