వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుపట్టా జారిందని కుమార్తెను కొట్టి చంపిన ముస్లిం తండ్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లక్నో: భోజనం చేస్తున్న సమయంలో కూతురు ముఖానికి ఉన్న ముసుగు జారిపోయిందన్న కోపంతో తన నాలుగేళ్ల కుమార్తెను కొట్టి చంపాడో అతి కిరాతకపు తండ్రి. జాలి, దయ చూపకుండా చిన్నారిని హత్య చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలి సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం సృష్టించిన ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అన్నం తింటున్న సమయంలో తన నాలుగేళ్ల కుమార్తె ముఖానికి ఉన్న ముసుగు (దుపట్టా) జారిపోయింది.

ఇది ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకమని, ఘోర తప్పిదమని భావించాడు జాఫర్. వెంటనే కోపంతో తన కూతురిని దారుణంగా కొట్టి, పాప తలను నెలకేసి బాదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లేదుటే తన కుమార్తెను కొడుతున్న సమయంలో కూతురి ప్రాణాలను కాపాడేందుకు భార్య ప్రయత్నించింది.

UP: Father kills 4-year-old daughter for not covering her head

దీంతో భార్యను సైతం వదల్లేదు ఈ కిరాతకపు తండ్రి. కుమార్తె చనిపోయిన తర్వాత ఇంట్లోనే ఇంట్లోనే ఖననం చేసేందుకు, భార్యను సహకరించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన భార్య, భర్త చేసిన దారుణంపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. జాఫర్‌కు నలుగురు పిల్లలు. 5 ఏళ్ల బాలుడు పెద్దవాడు కాగా, 10 నెలల శిశువు చిన్నవాడుగా ఉన్నాడు.

మత విశ్వాసాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే జాఫర్ బంధువులతో కూడా తెగదెంపులు చేసుకున్నాడు. తన నలుగురు పిల్లకు ప్రతిరోజూ అన్నం పెట్టలేకే మానసికంగా జాఫర్ ఇలా తయారయ్యాడని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన మూడు గంటలైనా పోలీసులు వచ్చేంత వరకు కూడా జాఫర్ ఇంట్లోకి స్ధానికులు వెళ్లేందుకు భయపడ్డారు.

English summary
A four-year-old girl in a village near Bareilly was killed allegedly by her father for failing to cover her head while having food, Uttar Pradesh police have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X