వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజం ఖాన్‌పై చర్యలు తీసుకోండి: యోగి ఆదిత్యనాథ్‌కు గవర్నర్ లేఖ

మాజీ మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అజమ్ ఖాన్ పైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గురువారం లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: మాజీ మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అజమ్ ఖాన్ పైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గురువారం లేఖ రాశారు.

<strong>అఖిలేష్ ఫోటోలు ఉన్నా ఓకే: దటీజ్ యోగి! అనూహ్య నిర్ణయం</strong>అఖిలేష్ ఫోటోలు ఉన్నా ఓకే: దటీజ్ యోగి! అనూహ్య నిర్ణయం

ఆజం ఖాన్‌ మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆక్రమించారని, ప్రజాధనంతో యూనివర్శిటీలో అతిథి గృహం నిర్మించారని, స్పోర్ట్స్ స్టేడియం సామాగ్రిని ప్రయివేటు వర్శిటీకి తరలించారని పలు ఆరోపణలు వచ్చాయి.

అజమ్ ఖాన్‌పై 42 పేజీల అధికారిక నివేదిక జత

అజమ్ ఖాన్‌పై 42 పేజీల అధికారిక నివేదిక జత

అజమ్ ఖాన్ పైన వచ్చిన 14 ఆరోపణలను గవర్నర్ అందులో ప్రస్తావించారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన 42 పేజీల అధికార నివేదికను కూడా తన లేఖతో జత చేశారు.

ప్రధాని కార్యాలయానికి ప్రతి

ప్రధాని కార్యాలయానికి ప్రతి

ఆజం ఖాన్‌పై చర్యల కోసం ఉత్తర ప్రదేశ్ అధికారులు ఈ ప్రతిని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి కూడా పంపించారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అజమ్ ఖాన్ దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు.

తక్కువ ధరకే భోజనం

తక్కువ ధరకే భోజనం

ఇదిలా ఉండగా, యూపీలో బీజేపీ ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమం కోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్ప‌టికే ఆ దిశ‌గా ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం యోగి ప్ర‌భుత్వం త్వరలో త‌క్కువ ధ‌ర‌కే భోజనాన్ని అందించే పథకాన్ని తీసుకురానున్నట్లు ప్ర‌క‌టించింది.

రూ.5కే భోజనం

రూ.5కే భోజనం

ఇందులో భాగంగా ఉదయం టిఫిన్‌గా పకోడా, పోహ, ఓట్స్‌తో తయారు చేసిన పదార్థాలు, టీ అన్ని కలిపి రూ.3లకే అందించ‌నున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం, రాత్రి వేళలో అన్నం, చపాతీ, శాకాహార కూర, పప్పుతో కలిపి రూ.5లకే భోజ‌నాన్ని అందించ‌నున్నట్లు తెలిపింది.

200 ప్రాంతాల్లో అన్నపూర్ణ

200 ప్రాంతాల్లో అన్నపూర్ణ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 200 ప్రాంతాల్లో ఈ 'అన్న‌పూర్ణ' కేంద్రాలు క‌నిపించ‌నున్నాయి. ఈ ప‌థ‌కం వ‌ల్ల వలస కూలీలు, పేద ప్ర‌జ‌ల‌కు లబ్ధి చేకూరుతుంద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది.

English summary
Uttar Pradesh Governor Ram Naik has written to Chief Minister Yogi Adityanath, seeking action against former Minister Mohammad Azam Khan on various charges, including misuse of official position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X