దారుణం: పోలీస్ స్టేషన్‌లోనే యువతిని కొట్టి, కాల్చి చంపేశారు

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో దారుణం జరిగింది. భూవివాదంలో ఓ మహిళను పోలీస్ స్టేషన్‌లోనే దారుణంగా కొట్టి చంపేశారు. ఆమె అరుస్తున్నా వదలలేదు. ఆమెపై కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

యువతి మృతి చెందడంతో స్థానికులు కొందరు నిందితులను పట్టుకొని కొట్టారు.

భూవివాదంలో ఓ యువతిని పోలీస్ స్టేషన్‌లో కాల్చి చంపారని, అక్కడున్న వారు నిందితుడుని పట్టుకున్నారని, పోలీసుల ఎదుట కొట్టారని చెబుతున్నారు.

కాగా, పోలీసుల ఎదుటనే నిందుతుడు ఆ యువతిని చంపేశాడని చెబుతున్నారు. కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్‌లోనే జరిగినందున పోలీసుల నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంరక్షణార్థం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

English summary
In a shocking incident, an unidentified woman has been murdered inside a police station in Uttar Pradesh on Tuesday.
Please Wait while comments are loading...