వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:సీటు దక్కలేదు, మంత్రి పదవి పోయింది, చివరికిలా ....

పార్టీ టిక్కెట్టు దక్కలేదు. పార్టీ టిక్కెట్టు దక్కలేదనే కోపంతో బిఎస్ పి లో చేరిన మంత్రి విజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి తప్పిస్తూ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు తన సిఫారసు లేఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు నిరాకరించిన మంత్రి చివరి నిమిషంలో బిఎస్ పి లో చేరారు.దీంతో మంత్రివర్గం నుండి విజయ్ మిశ్రాకు ఉద్వాసన పలికారు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఈ మేరకు గవర్నర్ కు అఖిలేష్ సిపారసు చేయడంతో విజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగిస్తూ రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘాజీపూర్ నుండి సమాజ్ వాదీ పార్టీ తరపున విజయ్ మిశ్రా పోటీచేసి విజయం సాధించారు. అఖిలేష్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

అయితే ఈ ఎన్నికల్లో ఘాజీపూర్ స్థానం నుండి విజయ్ మిశ్రాకు అఖిలేష్ టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో పార్టీ మారారు. సమాజ్ వాదీ పార్టీని వదిలి బిఎస్ పి లో చేరారు.

UP minister Vijay Mishra sacked after he joins BSP on ticket denial

ఈ దఫా ఘాజీపూర్ నుండి ఎస్ పి తరపున రాజేష్ కుష్వాహ బరిలోకి దింపింది.దీంతో విజయ్ మిశ్రా బిఎస్ పి లో చేరారు. మంత్రి విజయ్ మిశ్రా పార్టీ మారడంతో అఖిలేష్ ఆయనను మంత్రివర్గం నుండి తప్పించాలని గవర్నర్ రామ్ నాయక్ కు సిఫారసు చేశారు.

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిపారసు మేరకు మంత్రివర్గం నుండి విజయ్ మిశ్రాను తొలగిస్తూ గవర్నర్ రామ్ నాయక్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నాడు విజయ్ మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగిస్తున్నట్టు రాజ్ భవన్ ప్రకటించింది.

అయితే అఖిలేష్ పై మంత్రి పదవిని కోల్పోయిన విజయ్ మిశ్రా ఆరోపణలు గుప్పించారు. కొందరి చేతుల్లోనే అఖిలేష్ బందీగా మారారని చెప్పారు. బ్రహ్మణులకు వ్యతిరేకంగా అఖలేష్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

English summary
UP Minister Vijay Mishra, who had joined BSP after being denied ticket for the Assmebly polls, has been sacked from the Akhilesh Yadav government. Uttar Pradesh Governor Ram Naik sacked Mishra on the recommendations of Chief Minister Akhilesh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X