వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భట్టి: విహెచ్ అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సహా ఐదు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను మారుస్తూ ఏఐసీసీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పని చేశారు. అతను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు... నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.

తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో గత ఎన్నికల్లో తెరాస ప్రభంజనం వీచింది. అయినప్పటికీ ఆయన గెలుపొందారు. అంతేకాకుండా, కోదాడ నుండి తన భార్యను గెలిపించుకున్నారు. వివాదరహితుడిగా అతడికి పేరు ఉంది. దీంతో అతడి వైపు అధిష్టానం మొగ్గు చూపింది.

Uttam Kumar Reddy is new Telangana PCC president

మల్లు భట్టి విక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అతను ఓసారి ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీగా చేశారు. డిప్యూటీ స్పీకర్‌గాను పని చేశారు. ప్రస్తుతం మధుర ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రామగ్రామానికి కాంగ్రెస్ పార్టీని తీసుకు పోవాలని, ప్రజల పక్షాన పోరాడాలని సోనియా గాంధీ తనకు సూచించారని మల్లుభట్టి చెప్పారు.

అయిదు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు

తెలంగాణ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహారాష్ట్ర - అశోక్ చవాన్
గుజరాత్ - భరత్ సిన్హా సోలంకి
ఢిల్లీ - అజయ్ మాకెన్
జమ్మూ కాశ్మీర్ - గులామ్ అహ్మద్ మీర్తెరాస తప్పుడు హామీలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా తాను పని చేస్తానని చెప్పారు. తెరాస తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. పార్టీ ప్రతిష్టత కోసం అందర్నీ కలుపుకొని ముందుకు పోతానని చెప్పారు. సీనియర్లను కలుపుకొని వెళ్తానన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

పార్టీని క్షేత్రస్థాయి నుండి బలపరుస్తాం. గతంలో అవకాశం రాని వారికి పదవులు ఇస్తాం. యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎన్నికల హామీకి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామన్నారు. ముఖ్యమంత్రిది రాజకీయ దిగజారుడుతనమన్నారు. ఎన్నికల సమయంలో పార్టీని నడిపించిన పొన్నాల లక్ష్మయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వ తప్పిదాలను జానా నాయకత్వంలో ఎండగడతామన్నారు.

విహెచ్ అసంతృప్తి

టీపీసీసీ అధ్యక్షుడి నియామకం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలందరినీ సంప్రదించి పీసీసీ నియామకంపై నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. పార్టీలో 50 శాతం మంది బీసీలు ఉన్నారని, వారిని పక్కన పెట్టడం సరి

English summary
Ending speculation over replacement of Telangana Pradesh Congress Committee (TPCC) president Ponnala Lakshmaiah for the past few months, the AICC appointed Uttam Kumar Reddy as the new TPCC chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X