వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగీ ఎఫెక్ట్: ఆలీఘడ్ ముస్లీం వర్శిటీ మెనూలో మాంసం మాయం !

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పుడు ప్రముఖ ఆలీఘడ్ ముస్లీం విశ్వవిద్యాలయం (వర్సిటీ)పై పడింది. ఇటీవల వరకు ఆలీఘడ్ విశ్వవిద్యాలయంలో వారానికి రెండు సార్లు మాంసాన్ని పెట్టేవారు.

<strong>యోగి ఆదిత్యానాథ్ ఎఫెక్ట్: మాంసం వ్యాపారానికి గుడ్ బై: టీ దుకాణాలు!</strong>యోగి ఆదిత్యానాథ్ ఎఫెక్ట్: మాంసం వ్యాపారానికి గుడ్ బై: టీ దుకాణాలు!

ప్రస్తుతం ఉత్దరప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల ప్రభావం వలన ఆలీఘడ్ విశ్వవిద్యాలయంలో వారానికి రెండు సార్లు మాంసాన్ని ఆహారంలో పెట్టే నియమాలు మెనూలో నుంచి మాయం కానుంది. అక్రమ కబేళాలను మూసివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వం నియమాలు

ప్రభుత్వం నియమాలు

అక్రమ కబేళాలు మూసివేయాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించిన మాంసం దుకాణాలపై కూడా తాము కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మాంసం విక్రయాలు ఆగిపోయాయి.

మెనూలో నుంచి మాంసం మాయం

మెనూలో నుంచి మాంసం మాయం

ఆలీఘడ్ ముస్లీం విశ్వవిద్యాలయంలో ఫుడ్ మెనూలో వారానికి రెండు సార్లు మాంసంతో భోజనం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో మాంసం లభించని పరిస్థితి ఎదురైయ్యింది. ఈ ప్రభావం ఆలీఘడ్ ముస్లీం విశ్వవిద్యాలయంపై పడింది.

కూరగాయాల భోజనం

కూరగాయాల భోజనం

గత వారం రోజుల నుంచి ఆలీఘడ్ ముస్లీం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు కూరగాయలతో కూరలు చేసి భోజనం పెడుతున్నారు. ఈ విషయంపై విశ్వవిద్యాలయంలో గందగోళం నెలకొంది. విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరి చర్చించుకుంటున్నారు.

వీసీతో విద్యార్థి సంఘాలు భేటీ

వీసీతో విద్యార్థి సంఘాలు భేటీ

మెనూలో ఉన్న మాంసం భోజనం ఎందుకు పెట్టలేదు అనే విషయం గందరగోళం వైపు దారి తీయకముందే ఆలీఘడ్ విశ్వవిద్యాలయం వీసీ గురువారం విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించడానికి సిద్దం అయ్యారు. గురువారం మెనూ నుంచి మాంసం తొలగిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సిద్దం అయ్యారు.

పూర్తి వివరాలు వివరించాలని

పూర్తి వివరాలు వివరించాలని

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చెయ్యక ముందే అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది అనే విషయంపై ఆలీఘడ్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు వివరించాలని వీసీ నేతృత్వంలోని కమిటి సిద్దం అయ్యింది.

English summary
Meat has gone missing from the menu of Aligarh Muslim university. The university's student union has written to the Vice Chancellor complaining of only vegetarian food being served at hostels for well over a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X