బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఆకు పచ్చ చీరలతో బెంగళూరు జైల్లో శశికళ, సీఈవోతో తెప్పించుకుని !

ఇళవరసి కుమారుడు వివేక్ స్వయంగా పోయెస్ గార్డెన్ వెళ్లి జయలలితకు చెందిన ఆకు పచ్చ రంగు చీరలు తీసుకుని బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు ఇచ్చారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఎగిరెగిరిపడి చివరికి అక్రమాస్తుల కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో సెటిలైన చిన్నమ్మ శశికళ పలు కోరికలు కోరుతున్నారని వెలుగు చూసింది. శశికళ తనకు కావాలసిన వస్తువులు ఆమె బంధువులతో తెప్పించుకుంటున్నారని సమాచారం.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇటీవల శశికళతో పాటు అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె వదిన ఇళవరిసి కుటుంబ సభ్యులు బెంగళూరు పరప్పన అగ్రహార జైలు దగ్గరకు వెళ్లారు. ఆ సందర్బంలో జైల్లో ఇళవరిసితో పాటు శశికళను వారు కలిశారని తెలిసింది.

పోయెస్ గార్డెన్

పోయెస్ గార్డెన్

తనను కలిసిన బంధువులతో పోయెస్ గార్డెన్ లో ఎవరెవరు ఉంటున్నారని శశికళ ఆరా తీశారని సమాచారం. అంతే కాకుండా పోయెస్ గార్డెన్ ను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి సూచించారని తెలిసింది. పోయెస్ గార్డెన్ లో మనవాళ్లతో భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని శశికళ చెప్పారని సమాచారం.

జయలలిత ఆకు పచ్చ చీరలు

జయలలిత ఆకు పచ్చ చీరలు

పోయెస్ గార్డెన్ లోని జయలలిత గదిలో ఉన్న ఆకు పచ్చ చీరలు తీసుకురావాలని శశికళ ఆమె బంధువులకు సూచించారని తెలిసింది. అదే సమయంలో ఇళవరిసి కూడా తనకు కొన్ని చీరలు కావాలని బంధువులకు చెప్పారని సమాచారం.

ఇళవరసి కుమారుడు వివేక్

ఇళవరసి కుమారుడు వివేక్

ఇళవరసి కుమారుడు వివేక్ స్వయంగా పోయెస్ గార్డెన్ వెళ్లి జయలలితకు చెందిన ఆకు పచ్చ రంగు చీరలు తీసుకుని బెంగళూరు చేరుకుని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు ఇచ్చారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

అమ్మకు గుర్తుగా ఉండాలని

అమ్మకు గుర్తుగా ఉండాలని

జయలలిత గుర్తుగా ఆమె చీరలను శశికళ తెప్పించుకుని ఉంటారని చిన్నమ్మ వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. ఎవ్వరినీ నమ్మకుండా ఇళవరిసి కుమారుడు వివేక్ నే పోయెస్ గార్డెన్ పంపించి ఆకు పచ్చ చీరలు తీసుకురమ్మని శశికళ చెప్పారని తెలిసింది.

జాజ్ సినిమాస్ సీఈవో వివేక్

జాజ్ సినిమాస్ సీఈవో వివేక్

జాజ్ సినిమాస్ సీఈవోగా పని చేస్తున్న వివేక్ స్వయాన శశికళ సోదరుడి కుమారుడు. శశికళకు ముందు నుంచి వివేక్ అంటే ఇష్టమని, ఎక్కువ వివేక్ నే ఆమె దగ్గరకు తీసుకునేవారని సమాచారం. అందుకే వివేక్ ను పోయెస్ గార్డెన్ పంపించి ఆకు పచ్చ రంగు చీరలు తెప్పించుకున్నారని తెలిసింది.

శశికళ బినామి వివేక్ !

శశికళ బినామి వివేక్ !

హైదరాబాద్ లోని జయలలిత ద్రాక్ష తోటలు చూసుకుంటూ ఆనారోగ్యంతో శశికళ సోదరుడు మరణించారు. అలాంటి శశికళ సోదరుడి కుమారుడు వివేక్ కు ఇంత త్వరగా ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ అన్నాడీఎంకేలోని చాల మంది నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శశికళకు చెందిన అనేక బినామీ ఆస్తులు వివేక్ పేరు మీద ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

పోయెస్ గార్డెన్ కు వెళ్లాలని

పోయెస్ గార్డెన్ కు వెళ్లాలని

జాజ్ సీనిమాస్ సీఈవో వివేక్ త్వరలో పోయెస్ గార్డెన్ లో మకాం వేసే అవకాశం ఉందని చిన్నమ్మ వర్గంలోని నాయకులు అంటున్నారు. ఆదిశగా శశికళ పావులుకదుపుతున్నారని తెలిసింది. వివేక్ చిన్నప్పటి నుంచి పోయెస్ గార్డెన్ లోనే పెరిగాడు. వివేక్ సైతం పోయెస్ గార్డెన్ లో నివాసం ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది.

English summary
Sources said Sasikala asked to Ilavarasi son Vivek, She want Jayalalithaa sari. Vivek has taken to Jayalalithaa's green sari from Poes Garden to Bangaluru prison to Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X