వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ ఫస్ట్ చాన్స్ పన్నీర్ సెల్వంకే ఇచ్చారు: సగం విజయం, శశికళకు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం నువ్వా ? నేనా ? అంటూ పోటీ పడుతున్న పన్నీర్ సెల్వం, శశికళ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. అయితే తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడుగా దూసుకెళ్తున్నారు.

<strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్!</strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్!

గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావును కలవడానికి చెన్నైలోని రాజ్ భవన్ పన్నీర్ ల్వం, శశికళకు సమయం కేటాయించింది. అయితే అక్కడా పన్నీర్ సెల్వంకు చక్కటి అవకాశం చిక్కింది. గురువారం సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వంకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.

VK Sasikala to meet Governor at 7.30 pm, Panneerselvam at 5 pm

గురువారం రాత్రి 7.30 గంటలకు గవర్నర్ ను కలవడానికి శశికళ నటరాజన్ అవకాశం ఇచ్చారు. శశికళ కంటే ముందే రాజ్ భవన్ వెలుతున్న పన్నీర్ సెల్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి పూసగుచ్చినట్లు గవర్నర్ కు వివరించనున్నారు.

<strong>ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు!</strong>ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు!

తరువాత గవర్నర్ ను కలుస్తున్న శశికళ తనకు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు అనే విషయం వివరించనున్నారు. గురువారం మద్యాహ్నం చెన్నై చేరుకుంటున్న గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వాగతం పలకడానికి పన్నీర్ సెల్వం ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లారు.

వీలైతే ఎయిర్ పోర్టులోనే గవర్నర్ విద్యాసాగర్ రావుకు పూర్తి సమాచారం ఇవ్వాలని, తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు చేసిన సంతాకల పత్రాలు ఇవ్వాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. గవర్నర్ ను కలవడంలో పన్నీర్ సెల్వం ముందుండటంతో ఆయన సగం విజయం సాధించినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Tamil Nadu CM O Paneerselvam leaves for airport to receive Governor Vidyasagar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X